Breaking News

చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌.. ఆరోసారి ఛాంపియన్‌

Published on Sun, 11/09/2025 - 15:05

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు (Pakistan) హాంగ్‌ కాంగ్‌ సిక్సస్‌ (Hong Kong Sixes-2025) ట్రోఫీని కైవసం చేసుంది. ఇవాళ (నవంబర్‌ 9) జరిగిన 2025 ఎడిషన్‌ ఫైనల్లో కువైట్‌పై 43 పరుగుల తేడాతో గెలుపొంది, ఆరో సారి ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ అబ్బాస్‌ అఫ్రిది (Abbas Afridi) (11 బంతుల్లో 52 రిటైర్డ్‌ హర్ట్‌; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కువైట్‌ బౌలర్లను చీల్చి చెండాడు. 

ఓపెనర్లు అబ్దుల్‌ సమద్‌ (13 బంతుల్లో 42; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ఖ్వాజా నఫే (6 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సైతం చెలరేగిపోయారు. మిగతా బ్యాటర్లలో షాహిద్‌ అజీజ్‌ డకౌట్‌ కాగా, మాజ్‌ సదాకత్‌ 10, షెహజాద్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. కువైట్‌ బౌలర్లలో మీట్‌ భావ్సర్‌ 3 వికెట్లు తీశాడు.

భారీ లక్ష్య ఛేదనలో కువైట్‌కు మెరుపు ఆరంభం లభించినప్పటికీ.. ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో 5.1 ఓవర్లలో 6 వికెట్లూ కోల్పోయి 92 పరుగులకే పరిమితమైంది. మాజ్‌ సదాకత్‌ 3 వికెట్లు తీసి కువైట్‌ వెన్ను విరిచాడు. ముహమ్మద్‌ షెహజాద్‌, అబ్బాస్‌ అఫ్రిది, అబ్దుల్‌ సమద్‌ తలో వికెట్‌ తీశారు. 

కువైట్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అద్నాన్‌ ఇద్రీస్‌ (8 బంతుల్లో 30; 5 సిక్సర్లు), మీట్‌ భావ్సర్‌ (12 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం​ లేకుండా పోయింది. ఆతర్వాత వచ్చిన బిలాల్‌ తాహిర్‌ (6), రవీజా సందరువన్‌ (1), కెప్టెన్‌ యాసిన్‌ పటేల్‌ (14) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొహమ్మద్‌ షఫీక్‌ డకౌటయ్యాడు. 

కాగా, ఈ టోర్నీలో భారత్‌ నేపాల్‌, యూఏఈ, కువైట్‌, శ్రీలంక వంటి పసికూన చేతుల్లో ఓడి క్వార్టర్‌ ఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. 

చదవండి: IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్‌..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)