Breaking News

పాక్‌ ప్రపంచకప్‌ హీరోకు ఘోర అవమానం

Published on Tue, 03/03/2026 - 08:47

పాకిస్తాన్‌ టీ20 ప్రపంచకప్‌ హీరో సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు ఘోర అవమానం జరిగింది. హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలం తుది జాబితాలో అతనికి అవకాశం దక్కలేదు. ప్రపంచకప్‌ 2026లో రెండు సెంచరీలు సహా పలు భారీ రికార్డులు నెలకొల్పినా ఫర్హాన్‌ పేరు వేలం జాబితాలో కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫర్హాన్‌ సహా 49 పాక్‌ ఆటగాళ్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది.

కాగా, ఇంగ్లండ్‌ వేదికగా జరిగే హండ్రెడ్‌ లీగ్‌లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ వేలం​ మార్చి 11, 12 తేదీల్లో లండన్‌ వేదికగా జరుగనుంది. ఈ వేలంలో తొలుత 710 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 63 మంది పాకిస్తానీ క్రికెటర్లు ఉన్నారు. 

అయితే ఫ్రాంచైజీలు 75–100 మంది ఆటగాళ్లను మాత్రమే షార్ట్‌లిస్ట్ చేయమని ఆదేశించడంతో, చివరికి 243 మంది ఆటగాళ్లు మాత్రమే తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిలో పాకిస్తాన్ నుంచి కేవలం 14 మంది (షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్) అవకాశం దక్కింది.  

ఈ క్రమంలోనే సాహిబ్‌జాదా ఫర్హాన్ సహా 49 మంది పాక్‌ ఆటగాళ్ల పేర్లు గల్లంతయ్యాయి. ఫర్హన్‌.. టీ20 ప్రపంచకప్‌ 2026లో 76.60 సగటున 383 పరుగులు చేసి ప్రస్తుతానికి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ సింగిల్‌ ప్రపంచకప్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. 

గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. ఫర్హాన్‌ నమీబియా, శ్రీలంకపై అద్భుత శతకాలు సాధించాడు. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరకపోయినా, ఫర్హాన్ వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అయినా, హండ్రెడ్ లీగ్‌ ఫ్రాంచైజీలు అతన్ని పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది.  

మరోవైపు, వరల్డ్ కప్ జట్టులో లేని పాక్‌ పేసర్‌ హారిస్ రౌఫ్‌ వేలంలో మార్‌కీ ఆటగాడిగా ఎంపిక కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రౌఫ్‌తో పాటు  జో రూట్, జానీ బెయిర్‌స్టో వంటి ఇంగ్లండ్ స్టార్‌లు.. డేవిడ్ మిల్లర్, సునీల్ నరైన్ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా మార్‌కీ జాబితాలో ఉన్నారు. 

కాగా, హండ్రెడ్‌ లీగ్‌ వేలం జాబితాలో పాక్‌ స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌, మొహమ్మద్ రిజ్వాన్ పేర్లు కూడా లేవు. ఈ ఇద్దరు విండీస్‌తో టెస్ట్ సిరీస్ కారణంగా తమ పేర్లు నమోదు చేసుకోలేదు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)