Breaking News

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాక్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్ల రీఎంట్రీ

Published on Fri, 01/23/2026 - 17:00

టీ20 వరల్డ్‌కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్‌ జట్టును ఇవాళ (జనవరి 23) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్‌ అఘా కొనసాగనున్నాడు. ఈ సిరీస్‌తో స్టార్‌ ప్లేయర్లు బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది రీఎంట్రీ ఇచ్చారు.

వీరిద్దరు ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉండి, బిగ్‌బాష్‌ లీగ్‌లో పాల్గొన్నారు. మరో స్టార్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్‌ విభాగంలో అబ్రార్‌ అహ్మద్‌, మొహమ్మద్‌ నవాజ్‌, ఉస్మాన్‌ తారిక్‌కు చోటు దక్కింది.

లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో జరుగబోయే ఈ సిరీస్‌ కోసం పాక్‌ జట్టు శనివారం (జనవరి 24) లాహోర్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌లు జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగనున్నాయి. పాక్‌ గడ్డపై ఆస్ట్రేలియా ఆడబోతున్న రెండో టీ20 సిరీస్‌ ఇది. చివరిగా ఆసీస్‌ 2022లో పాక్‌లో పర్యటించి, ఏకైక టీ20 ఆడింది.

ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా పరిగణించబడుతోంది. ఈ సిరీస్‌ ముగిసిన వారం రోజుల్లోపే ప్రపంచకప్‌ మొదలవుతుంది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో పాక్‌ గ్రూప్‌-ఏలో ఉంది. 

ఈ గ్రూప్‌లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, భారత్‌ మిగతా జట్లుగా ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్‌లో శ్రీలంక, ఐర్లాండ్, ఒమాన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాక్‌ జట్టు
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, మొహమ్మద్ వసీమ్ జూనియర్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్
 

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు