Breaking News

టీ20 వరల్డ్‌కప్‌కు పాక్‌ జట్టు ప్రకటన.. ఎట్టకేలకు స్టార్‌ ప్లేయర్‌కు చోటు

Published on Sun, 01/04/2026 - 17:26

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్‌ ప్రొవిజనల్‌ జట్టును ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్‌ అఘా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీ​ని (వైస్‌ కెప్టెన్‌) ప్రకటించలేదు.

ఫామ్‌లేమితో సతమతమవుతున్న స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ ఎట్టకేలకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది సైతం ఈ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై ఆనిశ్చితి నెలకొంది. షాహీన్‌కు బ్యాకప్‌గా మరో పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ ఎంపికయ్యాడు. షాహీన్‌ తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడుతూ మోకాలి గాయం బారిన పడ్డ విషయం తెలిసిందే.

స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ రీఎంట్రీ ఇవ్వగా.. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. రిజ్వాన్‌ స్థానంలో ఉస్మాన్ ఖాన్ ప్రధాన వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. మెయిన్‌ స్క్వాడ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత (జనవరి 11) ప్రకటిస్తారు.  

టీ20 ప్రపంచకప్‌ కోసం పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టు
- సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్)  
- బాబర్ ఆజమ్  
- షాహీన్ అఫ్రిది (ఫిట్‌నెస్ అనిశ్చితి)  
- ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్)  
- షాదాబ్ ఖాన్  
- మొహమ్మద్ నవాజ్  
- ఫహీమ్ అష్రఫ్  
- హారిస్ రౌఫ్ (షాహీన్‌కు ప్రత్యామ్నాయం)  
- ఫకర​్‌ జమాన్‌
- మొహమ్మద్‌ వసీం జూనియర్‌
- నసీం షా
- అబ్దుల్‌ సమద్‌
- సాహిబ్‌జాదా ఫర్హాన్‌
- సైమ్‌ అయూబ్‌
- సల్మాన్‌ మీర్జా
- అబ్రార్‌ అహ్మద్‌

కాగా, టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ గ్రూప్‌-ఏ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ గ్రూప్‌లోనే టీమిండియా కూడా ఉంది. ఇతర జట్లుగా యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాక్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దాయాదుల సమరం ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరుగనుంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)