Breaking News

వారిద్దరిని మిస్ అవ్వడం లేదు..అన్నింటికీ మేము రెడీ: పాక్‌ కెప్టెన్‌

Published on Tue, 09/09/2025 - 15:33

ఆసియాక‌ప్‌-2025కు రంగం సిద్ద‌మైంది. అబుదాబి వేదిక‌గా మ‌రి కొన్ని గంట‌ల్లో అఫ్గానిస్తాన్‌-యూఏఈ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెర‌లేవ‌నుంది. అయితే ఈ ఖండాంతర‌ టోర్న‌మెంట్ ఆరంభానికి ముందు మొత్తం 8 జ‌ట్ల కెప్టెన్‌లు విలేక‌రుల స‌మావేశంలో పాల్గోన్నారు.ఈ సంద‌ర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 

స్టార్ ప్లేయర్లు బాబ‌ర్ ఆజం, మ‌హ్మ‌ద్ రిజ్వాన్ జ‌ట్టులో లేక‌పోవ‌డం త‌మకు ఎటువంటి న‌ష్టం క‌లిగించ‌దు స‌ల్మాన్ చెప్పుకొచ్చాడు. కాగా గ‌త కొంత కాలంగా బాబ‌ర్‌, రిజ్వాన్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుండ‌డంతో ఆసియాక‌ప్‌కు సెల‌క్ట‌ర్లు చేయ‌లేదు. సెల‌క్ట‌ర్ల నిర్ణ‌యాన్ని చాలా మంది త‌ప్పు బ‌ట్టారు. కాగా ఇటీవ‌ల కాలంలో పాక్ ఈ ఇద్ద‌రు దిగ్గ‌జ క్రికెట‌ర్లు లేకుండా ఓ మ‌ల్టీనేష‌న‌ల్ టోర్న‌మెంట్‌లో పాల్గొంటుండడం ఇదే తొలిసారి

"ప్ర‌స్తుతం మా జ‌ట్టు చాలా బాగుంది. గ‌త నాలుగు సిరీస్‌ల‌లో మేము మూడింట మేము విజ‌యం సాధించాము. అన్ని విభాగాల్లోనూ మేము మెరుగ్గా రాణిస్తున్నాము. ఏదేమైన‌ప్ప‌టికి ఆసియాక‌ప్ మాకు ఒక క‌ఠిన స‌వాల్ వంటిది. ఎందుకంటే మా జ‌ట్టులో చాలా మంది ఆట‌గాళ్లు తొలిసారి ఒక ప్ర‌ధాన టోర్న‌మెంట్‌లో ఆడ‌నున్నారు.

ఈ స‌వాల్‌ను ఎదుర్కొనేందుకు మేము సిద్దంగా ఉన్నాము. టీ20 క్రికెట్‌లో ఏ జ‌ట్టు ఫేవ‌రేట్ కాదు.  త‌మ‌దైన రోజున ప్ర‌తీ జ‌ట్టు అద్బుతాలు చేస్తోంది. ఒక‌ట్రెండు ఓవ‌ర్ల‌లో మ్యాచ్ స్వ‌రూప‌మే మారిపోతుంది. ఈ టోర్నీకి ముందు ముక్కోణ‌పు సిరీస్‌ను మేము స‌న్నాహ‌కంగా ఉప‌యోగించుకున్నాము.

సిరీస్‌ను గెలిచినందుకు సంతోషంగా ఉన్నాము" అని స‌ల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ మల్టీనేష‌న్ టోర్న‌మెంట్‌కు ముందు పాక్ జ‌ట్టు యూఏఈ, అఫ్గానిస్తాన్‌ల‌తో ట్రైసిరీస్‌లో త‌ల‌ప‌డింది. ఫైన‌ల్లో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి పాక్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు అదే జోరును ఆసియాక‌ప్‌లోనూ క‌న‌బరిచాల‌ని మెన్ ఈన్ గ్రీన్ భావిస్తుంది. ఈ ఖండాంత టోర్నీలో పాక్ జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌లో సెప్టెంబ‌ర్ 12న ఒమ‌న్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం సెప్టెంబ‌ర్ 14న టీమిండియాతో అమీతుమీ తెల్చుకోనుంది.
పాకిస్తాన్‌ జట్టు
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, సయీమ్‌ అయూబ్‌, సల్మాన్‌ మీర్జా, షాహిన్‌ అఫ్రిది, సూఫియాన్‌ మొకిమ్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)