టీమిండియాను పాక్‌ కూడా ఈజీగా ఓడిస్తుంది: వసీం అక్రమ్‌ ఎగతాళి

Published on Mon, 11/04/2024 - 13:09

స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌ను 3-0తో భార‌త జ‌ట్టు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. 24 ఏళ్ల త‌ర్వాత తొలిసారి సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై టీమిండియా ఘోర అవ‌మానాన్ని ఎదుర్కొంటుంది. ప్ర‌పంచంలోనే స్పిన్‌కు బాగా ఆడుతారని పేరొందిన భార‌త బ్యాట‌ర్లు.. ఇప్ప‌డు అదే స్పిన్‌ను ఆడేందుకు భయ‌ప‌డుతున్నారు. 

ముంబై 147 ప‌రుగుల స్వ‌ల్ఫ ల‌క్ష్యాన్ని కూడా భార‌త్ చేధించ‌లేక చ‌తిక‌ల‌ప‌డింది. కివీస్ స్పిన్న‌ర్ల దాటికి భార‌త బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు. భార‌త‌ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 9 వికెట్లు కివీ స్పిన్న‌ర్లే ప‌డ‌గొట్ట‌డం గ‌మ‌నార్హం. అయితే ఇదే అవ‌కాశంగా తీసుకుని భార‌త జ‌ట్టును ఇంగ్లండ్‌, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎగతాళి చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, పాక్ దిగ్గ‌జం వసీమ్ అక్రమ్‌లు భారత జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

పాక్ కూడా ఓడిస్తుంది?
మెల్‌బోర్న్ వేదిక‌గా తొలి వన్డేలో పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో అక్రమ్,మైఖేల్ వాన్‌లు కామేంట‌ర్‌ల‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో పాక్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా వాన్ మాట్లాడుతూ.."పాకిస్తాన్‌-భార‌త్ మ‌ధ్య టెస్టు సిరీస్ జరిగితే చూడాలనుకుంటున్నాను' అని అన్నాడు. 

అందుకు బ‌దులుగా అక్ర‌మ్ "నిజంగా అలా జ‌రిగితే చాలా బాగుంటుంది. ఇది రెండు దేశాల మ‌ధ్య స్నేహ‌ బంధాన్ని పెంచుతుంది" అని సమాధానమిచ్చాడు. ఇక్క‌డ‌వ‌ర‌కు అంతే బాగానే చివ‌రిలో అక్ర‌మ్, వాన్‌ త‌న వక్ర బుద్దిని చూపించుకున్నారు. "ఇప్పుడు స్పిన్‌పిచ్‌ల‌పై టీమిండియాను పాక్ ఓడించ‌గ‌ల‌దు" అని వాన్‌ వ్యాఖ్యనించాడు. అక్రమ్‌ కూడా అందుకు అంగీకరించాడు.

"భార‌త్ స్పిన్‌ను ఆడ‌టంలో ఇబ్బంది ప‌డుతంది. కాబ‌ట్టి ట‌ర్నింగ్ వికెట్‌ల‌పై టీమిండియాను ఓడించే అవ‌కాశ‌ముంది. న్యూజిలాండ్ భార‌త జ‌ట్టును వారి స్వ‌దేశంలోనే 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది" అని అక్ర‌మ్ రిప్లే ఇచ్చాడు. కాగా వీరిద్ద‌రి కామెంట్ల‌పై భార‌త జ‌ట్టు అభిమానులు మండిప‌డుతున్నారు. ముందు మీ జ‌ట్టు సంగ‌తి చూసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్‌!.. ఇక చాలు..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)