Breaking News

గెలుపు జోష్‌లో ఉన్న పాకిస్తాన్‌కు షాక్‌!

Published on Mon, 11/02/2026 - 14:49

ముక్కోణపు వన్డే సిరీస్‌లో విజేతగా నిలిచిన పాకిస్తాన్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో నిర్ణీత సమయంలో బౌలర్ల కోటా పూర్తి చేయనందున.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) పాక్‌ జట్టుకు జరిమానా వేసింది.

కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌, శ్రీలంకతో పాకిస్తాన్‌ ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడింది. ఈ క్రమంలో పాక్‌తో పాటు శ్రీలంక ఫైనల్‌ చేరగా ఇంగ్లండ్‌ ఇంటిబాట పట్టింది. ఇక శనివారం జరిగిన టైటిల్‌ పోరులో శ్రీలంకపై పాక్‌ మూడు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ సొంతం చేసుకుంది.

అయితే, ఈ మ్యాచ్‌లో పాక్‌ స్లో ఓవర్‌రేటు మెయింటెన్‌ చేసినందున మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకుంది.  జట్టులో ప్రతీ సభ్యుడి మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం కోత ఉంటుందని స్పష్టం చేసింది. పాక్‌ కెప్టెన్‌ షాహిన్‌ ఆఫ్రిది తమ తప్పిదాన్ని అంగీకరించాడని పేర్కొంది.

మ్యాచ్‌ విషయానికొస్తే... లాహోర్‌ వేదికగా జరిగిన ఫైనల్లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 325 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌.. అనూహ్య రీతిలో 48.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్‌ ఫఖార్‌ జమాన్‌ మెరుపు సెంచరీ (99 బంతుల్లో 127)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడుగా సాద్‌ బేగ్‌ (74), అరాఫత్‌ మిన్హాస్‌ (61) అర్ధ శతకాలతో రాణించారు. 

ఇవీ చదవండి: ఐదేసిన ముకేశ్‌.. సిరాజ్‌కు నాలుగు వికెట్లు; కివీస్ 424 ఆలౌట్‌
చరిత్ర సృష్టించిన నమీబియా.. ఐర్లాండ్‌కు షాక్‌!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)