‘అక్కడికి వెళ్లినా షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు.. అందుకే మా కెప్టెన్‌ ఇలా’

Published on Mon, 09/15/2025 - 11:08

టీమిండియా చేతిలో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు (IND vs PAK)కు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్‌ టీ20 టోర్నీ-2025లో భాగంగా భారత్‌ చేతిలో సల్మాన్‌ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాలు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి.

ఈ నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగాల వ్యక్తీకరణల నడుమ భారత్‌- పాక్‌ మైదానంలో దిగాయి. ‘బాయ్‌కాట్‌’ ట్రెండ్‌ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryalumar Yadav) ముందుగానే జాగ్రత్తపడ్డాడు. టాస్‌ సమయంలో పాక్‌ సారథి సల్మాన్‌ ఆఘా (Salman Agha)కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు.

ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్‌ ఆటగాళ్లతో కరచాలనానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఈ క్రమంలో పాక్‌ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్‌రూమ్‌ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది.

అక్కడికి వెళ్లినా షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు..
ఈ క్రమంలో అవమానభారంతో పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా పోస్ట్‌ మ్యాచ్‌ ప్రజెంటేషన్‌కు కూడా రాలేదు. ఈ విషయంపై పాక్‌ కోచ్‌ మైక్‌ హసన్‌ వివరణ ఇచ్చాడు. ‘‘ఏదో ఫ్లోలో అలా జరిగిపోయి ఉంటుందని అనుకున్నాం. వారితో కరచాలనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మా ప్రత్యర్థి జట్టు చేసిన పని మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది.

ఆ తర్వాత కూడా షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి వెళ్లాము. కానీ వాళ్లు అప్పటికే చేంజింగ్‌ రూమ్‌కి వెళ్లిపోయారు. నిజంగానే మేము కరచాలనానికి సిద్ధంగా ఉన్నా ఇలా జరగడం బాధ కలిగించింది’’ అని మైక్‌ హసన్‌ మీడియాతో పేర్కొన్నాడు.

ఆడుతూ.. పాడుతూ.. అలవోకగా..
కాగా దుబాయ్‌ వేదికగా భారత​- పాక్‌ ఆదివారం తలపడ్డాయి. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (40), పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది (33) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది.

భారత బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తిలకు చెరో ఒక వికెట్‌ దక్కింది.

ఇక లక్ష్య ఛేదనను టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 15.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. ఫలితంగా దాయాదిపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్‌ స్పెషలిస్టు బౌలర్లంతా విఫలం కాగా.. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ సయీమ్‌ ఆయుబ్‌ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

చదవండి: పాక్‌ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్‌ కరెక్ట్‌!

 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)