బుమ్రాపై పాక్‌ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 03/10/2026 - 18:11

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్‌లో జన్మించి, యూఏఈ తరఫున ఆడిన జహూర్ ఖాన్ అనే పేస్‌ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్‌ ఇచ్చానంటూ గొప్పలకు పోయాడు. స్లో డెలివరీ వేరియేషన్‌ను బుమ్రా తన వద్దనే నేర్చుకున్నాడని అన్నాడు.

జహూర్‌ మాటల్లో.. 2019లో నేను ఓ టీ10 లీగ్‌లో లెండిల్ సిమ్మన్స్‌కు ఐదు స్లో డెలివరీలతో మెయిడిన్ ఓవర్ వేసాను. ఆ వీడియో చూసిన బుమ్రా.. ఇవి ఎలా వేసావు.. హ్యాండ్ గ్రిప్ ఎలా ఉంటుందని నన్ను అడిగాడు. ఆతర్వాత ముంబై ఇండియన్స్ కోచింగ్‌ క్యాంప్‌లో నేను ఆయనకు అలాంటి బంతులే వేసి చూపించాను.  

జహూర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. జహూర్‌కు అంత సీన్‌ లేదని భారత క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. బుమ్రా నిరంతర అభ్యాసంతో ప్రపంచంలో అత్యుత్తమ పేసర్‌గా ఎదిగాడని కితాబునిస్తున్నారు.

వాస్తవానికి స్లో బాల్‌‌ అనేది బుమ్రా అమ్ములపోదిలో ఓ అస్త్రం. స్లో బంతులను అతను అద్భుతంగా ఎగ్జిక్యూట్‌ చేస్తాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. ఈ స్లో బాల్స్‌ను కూడా బుమ్రా అందరికీ భిన్నంగా వేస్తాడు. మణికట్టు సాయంతో సంధిస్తాడు. బ్యాటర్లు వీటిని పసిగట్టడం కష్టమవుతుంది. 

తాజాగా జరిగిన ప్రపంచకప్‌లోనూ బుమ్రా ఇలాంటి బంతులను చాలాసార్లు ప్రయోగించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో జేకబ్‌ బేతెల్‌ జోరు మీద ఉన్నప్పుడు వీటితోనే అతని ఆట కట్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లోనూ యార్కర్లతో పాటు ఈ స్లో డెలివరీలను ప్రయోగించాడు. 

ఫైనల్లో బుమ్రా అద్వితీయ ప్రదర్శన (4 వికెట్లు) కారణంగా భారత్‌ వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్‌ సాధించింది. ఈ ప్రపంచకప్‌లో బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 12.43 సగటున, 6.21 ఎకానమీతో 14 వికెట్లు తీసి భారత్‌ తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)