Breaking News

పాకిస్తాన్‌ క్రికెటర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ

Published on Fri, 12/05/2025 - 19:01

పాకిస్తాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్‌ ఫీజులో కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జతచేసింది. ఇందుకు సంబంధించి ఐసీసీ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ముక్కోణపు టీ20 సిరీస్‌
కాగా స్వదేశంలో శ్రీలంక- జింబాబ్వేలతో పాకిస్తాన్‌ ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌- శ్రీలంక (Pakistna vs Sri Lanka) ఫైనల్‌ చేరగా.. శనివారం (నవంబరు 29) రావల్పిండి వేదికగా మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. లంక బ్యాటింగ్‌ చేసింది.

కుప్పకూలిన లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌
ఓపెనర్‌ కామిల్‌ మిశారా (59) తప్ప మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. 19.1 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసి లంక ఆలౌట్‌ అయింది. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ ఆఫ్రిది (Shaheen Afridi), మొహమ్మద్‌ నవాజ్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. అబ్రార్‌ అహ్మద్‌ (Abrar Ahmed) రెండు, సల్మాన్‌ మీర్జా, సయీమ్‌ ఆయుబ్‌ చెరో వికెట్‌ కూల్చారు.

రాణించిన పాక్‌ టాపార్డర్‌
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ 18.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (23), సయీబ్‌ ఆయుబ్‌ (36) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మిగిలిన వారిలో కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా(14)తో పాటు ఫఖర్‌ జమాన్‌ (3) విఫలమయ్యారు. అయితే, పవన్‌ రత్ననాయకే బౌలింగ్‌లో దసున్‌ షనక క్యాచ్‌ పట్టడంతో ఫఖర్‌ జమాన్‌ అవుట్‌ కాగా.. అంపైర్‌ నిర్ణయాన్ని ఫఖర్‌ వ్యతిరేకించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో పందొమ్మిదో ఓవర్‌లో ఈ మేరకు ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇవ్వగా.. అతడితో వాగ్వాదానికి దిగాడు.

ఫఖర్‌ జమాన్‌ ఓవరాక్షన్‌.. షాకిచ్చిన ఐసీసీ
ఈ నేపథ్యంలో ఫఖర్‌ జమాన్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా వెల్లడించింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.8 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఫఖర్‌ జమాన్‌ మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కాబట్టి ఓ మెరిట్‌ పాయింట్‌ మాత్రమే జత చేస్తున్నాం.

అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయం పట్ల ధిక్కారం చూపినందుకు గానూ అతడికి శిక్ష విధిస్తున్నాం. అతడు కూడా తన తప్పిదాన్ని అంగీకరించాడు’’ అని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది.  కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం రెండేళ్ల కాలంలో ఓ ఆటగాడి ఖాతాలో నాలుగు లేదంటే అంతకంటే ఎక్కువ డీమెరిట్‌ పాయింట్లు చేరితే.. సదరు ప్లేయర్‌ తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం పడుతుంది. 

చదవండి: IND vs SA: మ‌న‌సు మార్చుకున్న గంభీర్‌..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)