Breaking News

టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో ఆసక్తికర సమరం

Published on Tue, 02/24/2026 - 10:53

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 24) మరో ఆసక్తికర సూపర్‌-8 సమరం జరుగనుంది.  పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ మ్యాచ్‌ పాకిస్తాన్‌కు డూ ఆర్‌ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాక్‌ సెమీస్‌ రేసులో ఉంటుంది. లేకపోతే సెమీస్‌ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. మరోపక్క ఇంగ్లండ్‌కు కూడా ఈ మ్యాచ్‌ కీలకమే. ఏ తలనొప్పి లేకుండా సెమీస్‌కు చేరాలనుకుంటే ఇంగ్లండ్‌ కూడా ఈ మ్యాచ్‌ తప్పనిసరిగా గెలవాలి.  

శ్రీలంకపై తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్‌ గ్రూప్‌-2 టాపర్‌గా ఉంది. ఆ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడంతో ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ (2.550) కూడా మెరుగ్గానే ఉంది. ఈ గ్రూప్‌  నుంచి తొలి సెమీస్‌ బెర్త్‌ దక్కించుకునే అవకాశాలు ప్రస్తుతానికి ఇంగ్లండ్‌కే అధికంగా ఉన్నాయి.

పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన తొలి సూపర్‌-8 మ్యాచ్‌ వర్షం​ కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఇరు జట్లు చెరో పాయింట్‌ పొందాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్‌ చేతిలో ఓడిన శ్రీలంక -2.550 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.

హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
పాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ ఇప్పటివరకు 30 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్‌ 21, పాక్‌ కేవలం 9 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో కూడా ఇంగ్లండే పైచేయి సాధించింది. ఇందులో 2022 ఎడిషన్‌ ఫైనల్‌ కూడా ఉంది.

పిచ్‌ కూడా వారికి అనుకూలమే..!
ఈ మ్యాచ్‌ జరుగనున్న పల్లెకెలె పిచ్‌ కూడా ఇంగ్లండ్‌కు అనుకూలంగానే ఉంది. ఈ వేదికపై ఆ జట్టు తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టునే చిత్తు చేసింది. దీనికి ముందు ఇదే వేదికపై లంకతో ద్వైపాక్షిక సిరీస్‌లో  టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది.  ఇది ఇంగ్లీష్‌ ఆటగాళ్లకు బాగా కలిసొస్తుంది. 

మరోపక్క పాక్‌ ఈ వేదికపై ఇటీవలికాలంలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఈ పిచ్‌ పరిస్థితులపై కూడా ఆ జట్టుకు అవగాహణ లేదు. ఎటు చూసినా నేటి మ్యాచ్‌లో ఇంగ్లండే హాట్‌ ఫేవరెట్‌గా కనిపిస్తుంది.. పాక్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌ ప్రస్తుత టోర్నీలో మెరుగైన ఫామ్‌లో ఉంది. 

గ్రూప్‌ దశలో స్కాట్లాండ్‌, ఇటలీ, నేపాల్‌పై విజయాలు సాధించి సూపర్‌-8లోకి అడుగుపెట్టింది. పాక్‌ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా గ్రూప్‌ దశలో 3 విజయాలు సాధించి, సూపర్‌-8లోకి ప్రవేశించినా.. తమకంటే చిన్న జట్లపై గెలిచేందుకు పాక్‌ ప్లేయర్లు ఆపసోపాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

తుది జట్లు (అంచనా)..

ఇంగ్లండ్‌: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వారం), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (సి), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

పాకిస్తాన్‌: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా (c), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (wk), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)