Breaking News

సల్మాన్‌ అఘా మెరుపు శతకం.. పాకిస్తాన్‌ భారీ స్కోర్‌

Published on Tue, 11/11/2025 - 19:30

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (నవంబర్‌ 11) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్‌ భారీ స్కోర్‌ చేసింది. టీ20 జట్టు కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (87 బంతుల్లో 105 నాటౌట్‌; 9 ఫోర్లు) మెరుపు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.

ఆల్‌రౌండర్‌ హుస్సేన్‌ తలాత్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ (32), మొహమ్మద్‌ నవాజ్‌ (36 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. బాబర్‌ ఆజమ్‌ (29) మరోసారి మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సైమ్‌ అయూబ్‌ (6), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (5) నిరాశపరిచారు.

శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ (10-0-54-3), అషిత ఫెర్నాండో (10-2-42-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. తీక్షణ ఓ వికెట్‌ తీశాడు. రావల్పిండి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

బాబర్‌ వైఫల్యాల పరంపర
అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్‌ ఆజమ్‌ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. మూడు ఫార్మాట్లలో అతను సెంచరీ చేసి ఏకంగా 799 రోజులవుతుంది. ఇన్నింగ్స్‌ల పరంగా (3 ఫార్మాట్లలో) ఇది 83కు పెరిగింది. బాబర్‌ చివరిగా 2023 ఆగస్ట్‌లో నేపాల్‌పై సెంచరీ చేశాడు. అప్పటి నుంచి అతని ఫామ్‌ అదఃపాతాళానికి పడిపోయింది. ఫామ్‌లేమి కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు.

చదవండి: విరాట్‌ కోహ్లి రికార్డు సమం చేసిన బాబర్‌ ఆజమ్‌

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)