Breaking News

Pak vs Eng: పాకిస్తాన్‌లో కాదు శ్రీలంకలో!?

Published on Thu, 09/05/2024 - 17:25

బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. అక్టోబరు 7 నుంచి ఈ సిరీస్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ముల్తాన్‌, కరాచి, రావల్పిండిలో ఈ మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్‌- ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ వేదికను విదేశానికి తరలించినట్లు సమాచారం. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లేదా శ్రీలంకలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌లోని స్టేడియాల పునరుద్ధరణ కార్యక్రమం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

అందుకే వేదిక మార్పు
కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీని సమర్థవంతంగా నిర్వహించాలంటే పాక్‌ స్టేడియాల్లో తగిన సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో పాక్‌ బోర్డు వివిధ స్టేడియాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో టెస్టుమ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ  నేపథ్యంలో  ఇంగ్లండ్‌తో సిరీస్‌ వేదికను తరలించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

కానీ.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డును ఇందుకు ఒప్పించడం సహా... యూఏఈ లేదంటే శ్రీలంకలో సిరీస్‌ నిర్వహించడం పాక్‌ బోర్డుకు అంతతేలికేమీ కాదు. ఎందుకంటే.. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్‌-2024 వేదికగా ఇప్పటికే యూఏఈని ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబరు 3- 20 వరకు ఈ మెగా ఈవెంట్‌ జరుగనుంది.

లంక బెస్ట్‌ ఆప్షన్‌
కాబట్టి యూఏఈలో పాకిస్తాన్‌- ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు.. శ్రీలంకలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడా మ్యాచ్‌లు సజావుగా నిర్వహించడం కష్టమేకానుంది. అయితే, లంక కంటే ఉత్తమ ఆప్షన్‌ లేదు కాబట్టి అక్కడే ఈ సిరీస్‌ను నిర్వహించాలని పాక్‌ బోర్డు భావిస్తున్నట్లు ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో 0-2తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ బంగ్లా చేతిలో టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.

పాకిస్తాన్‌లో ఇంగ్లండ్‌ పర్యటన 2024- ఖరారైన షెడ్యూల్‌
మొదటి టెస్టు- అక్టోబరు 7- అక్టోబరు 11- ముల్తాన్‌
రెండో టెస్టు- అక్టోబరు 15- అక్టోబరు 19- కరాచి
మూడో టెస్టు- అక్టోబరు 24- అక్టోబరు 28- రావల్పిండి.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)