Breaking News

టీమిండియాతో పోటీపడిన పాక్‌.. భారత్‌ 0/6.. పాక్‌ 9/6 

Published on Fri, 01/05/2024 - 14:52

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తమ చివరి ఆరు వికెట్లు ఒకే స్కోర్‌ వద్ద (153) కోల్పోయిన ఘటన మరువక ముందే.. దాయాది పాకిస్తాన్‌ దాదాపుగా ఇలాంటి సీన్‌నే మరోసారి రిపీట్‌ చేసింది. 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి, ఏ విషయంలోనైనా వారు భారత్‌నే ఫాలో అవుతారనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు.  

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్ల పుణ్యమా అని తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసింది. ఆరో నంబర్‌ ఆటగాడు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (88), ఏడో నంబర్‌ ఆటగాడు అఘా సల్మాన్‌ (53), తొమ్మిదో నంబర్‌ ప్లేయర్‌ ఆమిర్‌ జమాల్‌ (82) అర్ధసెంచరీలు చేసి పాక్‌ను ఆదుకున్నారు. 

అనంతరం ఆమిర్‌ జమాల్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో (6/69) తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 299 పరుగులకే పరిమితం చేసి, ప్రస్తుత సిరీస్‌లో పాక్‌కు తొలి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే పాక్‌ బ్యాటర్లు ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. 

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 58 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన పాక్‌.. ఆతర్వాత తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్‌ 67/7గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్‌ ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడం చాలా కష్టం.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో హాజిల్‌వుడ్‌ అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో (5-2-9-4) పాక్‌ను కష్టాల ఊబిలోకి నెట్టాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన ఆసీస్‌ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ఈ మ్యాచ్‌ కూడా ఓడితే ఆసీస్‌ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసినట్లవుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)