Breaking News

అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్‌

Published on Wed, 08/23/2023 - 08:41

Afghanistan vs Pakistan, 1st ODI: అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్తాన్‌ విజయంతో ఆరంభించింది. శ్రీలంకలోని హంబన్‌టోటాలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 142 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా తన పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టింది. 

కాగా తొలి వన్డేలో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, అఫ్గన్‌ బౌలర్ల ధాటికి పాక్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్ అర్ధ శతకంతో(61)తో రాణించగా.. షాబాద్‌ ఖాన్‌ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు.

చుక్కలు చూపించిన రవూఫ్‌
మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాకిస్తాన్‌ 201 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌కు పాకిస్తాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ చుక్కలు చూపించాడు. 6.2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు కూల్చాడు.

రవూఫ్‌ దెబ్బకు అఫ్గన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కకావికలమైంది. 19.2 ఓవర్లలో 59 పరుగుల వద్ద అఫ్గన్‌ కథ ముగిసిపోయింది. అఫ్గన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించిన హారిస్‌ రవూఫ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

పాత రికార్డు బద్దలు కొట్టిన పాక్‌.. చెత్త రికార్డుతో అఫ్గన్‌
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బాబర్‌ ఆజం బృందం సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసిన పాక్‌ జట్టుగా నిలిచింది. 

అంతకు ముందు 1998లో శ్రీలంకపై పాకిస్తాన్‌ 110 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు అఫ్గన్‌పై విజయంతో ఈ రికార్డును బాబర్‌ బృందం చెరిపేసింది. కాగా వన్డేల్లో అఫ్గనిస్తాన్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

చదవండి: Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్‌లకు ఛాన్స్‌!  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)