ధోని ఫోన్ లిఫ్ట్ చేశాడా? నేను నమ్మలేకపోతున్నా: భారత మాజీ క్రికెటర్‌

Published on Sun, 08/31/2025 - 08:55

భార‌త క్రికెట్ జ‌ట్టు మెంటార్‌గా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మ‌రోసారి నియ‌మించేందుకు బీసీసీఐ సిద్దమైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. ఇప్ప‌టికే భార‌త క్రికెట్ బోర్డు ధోనితో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. కానీ ధోని ఇంకా త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేయ‌లేద‌ని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కాగా ఈ జార్ఖండ్ డైన‌మేట్‌ టీ20 ప్రపంచకప్‌-2021లో అప్పటి హెడ్‌కోచ్‌ రవిశాస్త్రితో కలిసి భారత జట్టు మెంటార్‌గా ధోని పనిచేశాడు. అయితే మ‌ళ్లీ ఇప్పుడు అత‌డు అనుభవాన్ని ఉప‌యోగించుకోవాల‌ని బీసీసీఐ భావిస్తుందంట‌. ఈ నేప‌థ్యంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌నోజ్ తివారీ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. 

ధోనిని సంప్ర‌దించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని, అత‌డు నిజంగా బీసీసీఐ ఫోన్ కాల్‌కు స్పందించాడా అని? ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. కాగా ధోనిపై చాలా రోజుల నుంచి తివారీ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ధోని త‌న‌కు అన్యాయం చేశాడ‌ని, అత‌డి వ‌ల్లే త‌న అంత‌ర్జాతీయ కెరీర్ ముగిసిపోయింద‌ని ప‌దేప‌దే తివారీ ఆరోపిస్తూ వ‌స్తున్నాడు.

"ఆట‌గాడిగా, కెప్టెన్‌గా ధోనికి అపార‌మైన అనుభ‌వం ఉంది. అటువంటి వ్య‌క్తి టీమిండియాకు మెంటార్‌గా వ‌స్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  యువ ఆట‌గాళ్ల‌ను స్టార్ల‌గా తీరిదిద్దడంలో అత‌డు కీల‌క పాత్ర పోషిస్తాడు. అయితే అత‌డికి నిజంగా బీసీసీఐ ఆఫ‌ర్ ఇచ్చిందో లేదో త్వ‌ర‌లోనే తెలుస్తోంది. 

కానీ అత‌డు బోర్డ్ ఫోన్ కాల్‌కు స్పందించాండంటే నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఎందుకంటే అతన్ని ఫోన్‌లో సంప్రదించడం కష్టం. మెసేజ్‌ల‌కు కూడా ధోని రిప్లే ఇవ్వ‌డం చాలా అరుదు. ఈ విష‌యం ఇప్ప‌టికే చాలా మంది చెప్పారు. 

మ‌నం పంపిన మెసేజ్‌ను కూడా అత‌డు చదువుతాడా లేదో కూడా తెలియ‌దు. ఏదేమైన‌ప్ప‌టికి అత‌డు మెంటార్ వ‌స్తే జ‌ట్టుకు మేలు జ‌రుగుతంద‌ని నేను అనుకుంటున్నాను. ధోని, గౌత‌మ్ గంభీర్ జోడీ అద్బుతాలు చేయ‌వ‌చ్చు" అని ఎఎన్ఐకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు. ఒకవేళ బీసీసీఐ ఆఫర్‌ను ధోని అంగీకరిస్తే టీ 20 ప్రపంచకప్‌-2026కు ముందే భారత జట్టు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
చదవం‍డి: DT 2025: అంకిత్‌, యశ్‌ ధుల్‌ సెంచరీలు.. భారీ ఆధిక్యంలో నార్త్‌ జోన్‌

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)