వైభవ్‌కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం

Published on Sat, 06/20/2026 - 19:09

భారత నయా సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పద్నాలుగేళ్లకే ఐపీఎల్‌లో సంచలనాలు సృష్టించిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. భారత అండర్‌-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు.

ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్‌ సూర్యవంశీ.. 16 మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా 2026 సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. పదిహేనేళ్లకే ఆరెంజ్‌క్యాప్‌ అందుకుని చరిత్ర సృష్టించాడు.

శ్రీలంక పర్యటనలో
ఈ క్రమంలో తొలిసారి భారత్‌- ‘ఎ’ జట్టు, టీమిండియాకు ఎంపికైన వైభవ్‌ సూర్యవంశీ.. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో బిజీగా ఉన్నాడు. శ్రీలంక, భారత్‌, అఫ్గానిస్తాన్‌ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైభవ్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. నాలుగు లీగ్‌ మ్యాచ్‌లలో వరుసగా 14, 44, 21, 38 పరుగులే చేశాడు.

ఇదిలా ఉంటే.. వైభవ్‌ను చూసేందుకు శ్రీలంక ప్రేక్షకులు ఎగబడ్డారు. ఎయిర్‌పోర్టులో అతడి కోసం వేచి ఉండి మరీ ఫొటోలు దిగారు. హోటల్‌లోనూ ఫొటోల కోసం అభిమానులు రాగా.. వైభవ్‌ కొన్నిసార్లు సున్నితంగా తిరస్కరించాడు.

గంటసేపు ఎదురుచూసి మరీ
అయితే, అందరింకంటే ప్రత్యేకమైన అభిమాని ఒకరు వైభవ్‌ కోసం దాదాపు గంటసేపు ఎదురుచూసి మరీ అతడిని కలిశారు. ఆయన మరెవరో కాదు.. శ్రీలంక జాతీయ జట్టుకు మొట్టమొదటి వన్డే కెప్టెన్‌గా పనిచేసిన అనురా తెనాకూన్‌.

ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పే
శ్రీలంక- భారత్‌ ‘ఎ’ జట్ల మధ్య సోమవారం నాటి అనధికారిక వన్డే సందర్భంగా అనురా వైభవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన సంభాషణను తాజాగా వెల్లడించారు. ‘‘ఐపీఎల్‌లో వైభవ్‌ సూర్యవంశీ ప్రదర్శన చూసి నేను ముగ్ధుడినయ్యాను.

అతడి బ్యాటింగ్‌ చూసేందుకే దంబుల్లా స్టేడియానికి వెళ్లాను. కానీ దురదృష్టవశాత్తూ అతడి బ్యాట్‌ నుంచి మెరుపులు చూడలేకపోయాను. మా ఆటగాళ్లు అతడిని చుట్టుముట్టి రెచ్చగొట్టారు. అతడింకా పిల్లాడే.

అప్పటికే మ్యాచ్‌ ఓడిన కోపంలో ఉన్నాడు. మా వాళ్లు కవ్వించడంతో తానూ రెచ్చిపోయాడు. భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోయాడు. దురదృష్టవశాత్తూ ఆ ఘటన జరిగిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పే.

మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడా
ఆరోజు నన్ను కలిసినపుడు వైభవ్‌ నా దగ్గరికొచ్చి.. ‘సర్‌. మీ ఆశీసులు కావాలి. మిమ్మల్ని కలవడం నా అదృష్టం’ అంటూ నా పాదాలకు నమస్కరించాడు. మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడా ఇలా నా పాదాలు తాకి ఆశీసులు తీసుకున్న దాఖలాలే లేవు. వైభవ్‌ను ఆరోజు రెచ్చగొట్టినందు వల్లే అలా ప్రవర్తించాడు’’ అని అనురా తెనాకూన్‌ పేర్కొన్నారు.

కాగా శ్రీలంకతో సోమవారం నాటి మ్యాచ్‌ ‘టై’ కాగా.. సూపర్‌ ఓవర్లో భారత్‌ ఓడిపోయింది. ఈ క్రమంలో లంక ప్లేయర్‌ విశేన్‌.. వైభవ్‌ను ఉద్దేశించి ‘ఇంటికి వెళ్లిపో’ అంటూ రెచ్చగొట్టగా.. అతడూ తిరిగి బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ శిక్ష పడింది. ఇక ఈ ఘటన గురించి తాజాగా అనురా తెనాకూన్‌ వద్ద ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు.

చదవండి: వైభవ్‌ను  టార్గెట్‌ చేస్తారా?

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)