Breaking News

‘స్టోక్స్‌ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’

Published on Tue, 07/29/2025 - 13:47

ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes)కు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ అండగా నిలిచాడు. మాంచెస్టర్‌ టెస్టులో టీమిండియా ఆటగాళ్లకు ముందుగానే ‘షేక్‌హ్యాండ్‌’ ఇవ్వడంలో తప్పులేదంటూ సమర్థించాడు. జెంటిల్‌మేన్‌ గేమ్‌ అంటే.. ఇలాగే ఉండాలంటూ స్టోక్స్‌కు మద్దతు పలికాడు.

ఆద్యంతం ఉత్కంఠ
సౌతాఫ్రికా స్పిన్నర్‌ తబ్రేజ్‌ షంసీకి కౌంటర్‌ ఇచ్చే క్రమంలో డేల్‌ స్టెయిన్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగిందంటే.. భారత్‌- ఇంగ్లండ్‌ (Ind vs Eng) మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు జరిగింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్‌ బృందం ఏకంగా 669 పరుగులు చేసింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌ పరుగుల ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది.

నలుగురు హీరోలు
అనంతరం ఊహించని రీతిలో పుంజుకుని ఆఖరి రోజు ఆఖరి సెషన్‌ వరకూ నిలబడి.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (90) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (103) ఆడాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత భారత శిబిరంలో ఆందోళన పెరిగింది.

ఈ క్రమంలో స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతమే చేశారు. జడ్డూ 107, వాషీ 101 పరుగులతో సత్తా చాటారు. అయితే, వీరు శతకాలకు చేరువైన వేళ.. ఎలాగో ఫలితం తేలదు కాబట్టి ఇక చాలు ఆపేద్దాం అని స్టోక్స్‌ పదే పదే షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు వచ్చాడు. అయితే, జడ్డూ మాత్రం ఇందుకు నిరాకరించాడు.

సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాతే డ్రా
ఇక జడ్డూ, వాషీ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా డ్రాకు సమ్మతం తెలిపింది. ఈ నేపథ్యంలో స్టోక్స్‌ తీరుపై విమర్శలు వచ్చాయి. సౌతాఫ్రికా స్పిన్నర్‌ షంసీ కూడా.. జడేజా, వాషీ శతకాలు పూర్తి చేసుకునేందుకు అర్హులంటూ స్టోక్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా విమర్శించాడు.

స్టోక్స్‌ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు
ఇందుకు ప్రొటిస్‌ మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ బదులిస్తూ.. ‘‘షామో.. ఉల్లిపాయ ఎన్నో పొరలతో నిర్మితమై ఉంటుంది. ఒక్కో పొర తీస్తున్నకొద్దీ ఎవరో ఒకరు ఏడవక తప్పదు. సంక్లిష్టమైన సందర్భాల్లో దీనిని మనం అన్వయించుకోవచ్చు.

అక్కడున్న బ్యాటర్లు సెంచరీలు పూర్తి చేసేందుకు ఆడటం లేదు. కేవలం మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకే వారు బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఒక్కసారి ఆ పని పూర్తైన తర్వాత జెంటిల్‌మేన్‌ ఎవరైనా షేక్‌హ్యాండ్‌ ఇస్తారు.

అంతేగానీ.. అక్కడ మిగిలి ఉన్న సమయాన్ని మైలురాళ్లను చేరుకునేందుకు ఉపయోగించుకోకూడదు. అయితే, నిబంధనల ప్రకారం వారు తమ పని పూర్తి చేసుకోవచ్చు. కానీ చూడటానికి ఇది అంత గొప్పగా కనిపించదు.

ఒకవేళ నిజంగానే వాళ్లు సెంచరీలు పూర్తి చేయాలనుకుంటే ముందు నుంచే ఎందుకు వేగంగా ఆడలేదు. చివరి సెషన్‌.. చివరి గంట వరకూ ఎందుకు నెమ్మదిగానే ఆడారు. డ్రా కోసమే వారు అలా చేశారు. మరి అలాంటప్పుడు ఒక జట్టునే నిందించడం దేనికి?’’ అని ప్రశ్నించాడు.

 ‘నేను’ అనే స్వార్థానికి తావుండదు
ఇందుకు.. ‘‘ఇరుజట్లకూ తమ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. ఒకవేళ బ్యాటర్‌ను ఫీల్డ్‌ బయటకు పంపించాలంటే అవుట్‌ చేయవచ్చు కదా!’’ అంటూ షంసీ కౌంటర్‌ ఇచ్చాడు. 

ఈ క్రమంలో.. ‘‘చివరి గంట వ్యక్తిగత మైలురాళ్లను చేరుకోవడానికి కేటాయించింది కాదు. జట్టులో ‘నేను’ అనే స్వార్థానికి తావుండదు. ఒకవేళ నేనే అక్కడ 90 పరుగులతో ఉండి ఉంటే కచ్చితంగా డ్రాకు అంగీకరించేవాడిని’’ అని స్టెయిన్‌ బదులిచ్చాడు. 

చదవండి: నా కొడుకు ఏమి త‌ప్పు చేశాడు: సెలక్టర్లపై సుందర్‌ తండ్రి ఫైర్‌

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు