Breaking News

మాటల్లో వర్ణించలేని క్యాచ్‌.. మాయ చేసిన గ్లెన్‌ ఫిలిప్స్‌

Published on Thu, 02/15/2024 - 20:18

క్రికెట్‌ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్‌ నమోదైంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ నమ్మశక్యంకాని రీతిలో కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. ఫిలిప్స్‌ పట్టిన ఈ క్యాచ్‌ను మాటల్లో వర్ణించలేని పరిస్థితి. గల్లీలో ఫీల్డింగ్‌ చేస్తున్న ఫిలిప్స్‌ తన కుడివైపుకు గాల్లోకి డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టుకున్నాడు. ఫిలిప్స్‌ ఈ క్యాచ్‌ పట్టాక న్యూజిలాండ్‌ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. 

రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా హ్యామిల్టన్‌ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌ ఈ కళ్లు చెదిరే క్యాచ్‌కు వేదికైంది. మూడో రోజు ఆటలో కీగన్‌ పీటర్సన్‌ కొట్టిన షాట్‌ను ఫిలిప్స్‌ అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. 

కాగా, పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుంది. కఠినమైన పిచ్‌పై పర్యాటక సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌కు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ వికెట్‌ కోల్పోయి 40 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ గెలవాలంటే ఇంకా 227 పరుగులు చేయాలి. 

స్కోర్ వివరాలు.. 

  • సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 242 ఆలౌట్‌ (డి స్వార్డ్ట్‌ 64, విలియమ్‌ రూర్కీ 4/59)
  • న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 211 ఆలౌట్‌ (విలియమ్సన్‌ 43, డి పైడ్ట్‌ 5/89)
  • సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 235 ఆలౌట్‌ (బెడింగ్హమ్‌ 110, విలియమ్‌ రూర్కీ 5/34)
  • న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 40/1 (టామ్‌ లాథమ్‌ 21 నాటౌట్‌, డి పైడ్ట్‌ 1/3)

న్యూజిలాండ్‌ గెలవాలంటే 227 పరుగులు చేయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)