Breaking News

బ్రాడ్‌మన్‌, కోహ్లిలను అధిగమించిన విలియమ్సన్‌

Published on Sun, 02/04/2024 - 14:53

న్యూజిలాండ్‌ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించడం ద్వారా టెస్ట్‌ల్లో 30 సెంచరీల మార్కును (97 మ్యాచ్‌ల్లో) తాకాడు. ఈ ఘనత సాధించే క్రమంలో దిగ్గజ ఆటగాళ్లు డాన్‌ బ్రాడ్‌మన్‌, విరాట్‌ కోహ్లిల రికార్డులను అధిగమించాడు.

టెస్ట్‌ల్లో బ్రాడ్‌మన్‌ (52 టెస్ట్‌లు), విరాట్‌ కోహ్లి (113 టెస్ట్‌లు) 29 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో కేన్‌ వీరిద్దరిని దాటాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో కేన్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌తో (137 మ్యాచ్‌లు) సమానంగా 30 సెంచరీలు కలిగి ఉన్నాడు. యాక్టివ్‌ క్రికెటర్లలో అత్యధిక టెస్ట్‌ సెంచరీ రికార్డు స్టీవ్‌ స్మిత్‌ పేరిట ఉంది. స్మిత్‌ ఇప్పటివరకు 32 సెంచరీలు (107 టెస్ట్‌ల్లో) చేశాడు. 

అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీల రికార్డు (యాక్టివ్‌ క్రికెటర్లలో) విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. ప్రస్తుతం విరాట్‌ ఖాతాలో 80 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌ (49 సెంచరీలు), జో రూట్‌ (46), రోహిత్‌ శర్మ (46), స్టీవ్‌ స్మిత్‌ (44), కేన్‌ విలియమ్సన్‌ (43) విరాట్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.  ప్రస్తుత టెస్ట్‌ బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న కేన్‌.. గత 9 టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేయడం విశేషం.

ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో కేన్‌ విలియమ్సన్‌తో (112) పాటు వన్డే వరల్డ్‌కప్‌ సెన్సేషన్‌ రచిన్‌ రవీంద్ర (118) కూడా సెంచరీతో కదంతొక్కాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ అజేయ శతకాలతో ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. న్యూజిలాండ్‌ స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 258 పరుగులుగా ఉంది.

ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (20), డెవాన్‌ కాన్వే (1) ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మొరేకీ, ప్యాటర్సన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌ కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. 


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు