NZ Vs PAK 1st T20: షాహీన్‌ అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్‌ ఓపెనర్‌

Published on Fri, 01/12/2024 - 12:48

పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌, ఆ జట్టు కొత్త కెప్టెన్‌ షాహీన్‌ అఫ్రిదికి న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో అలెన్‌ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన అలెన్‌.. ఆతర్వాత హ్యాట్రిక్‌ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్‌ బాదాడు. ఆఖరి బంతి డాట్‌ బాల్‌ అయ్యింది.

ఆమిర్‌ జమాల్‌ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో రెండో బంతిని సైతం సిక్సర్‌గా మలిచిన అలెన్‌.. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్‌లో మరో అఫ్రిది (అబ్బాస్‌ అఫ్రిది) అలెన్‌ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న కివీస్‌.. 11.2 ఓవర్లు ముగిసే సమయాని​కి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.

అలెన్‌, డెవాన్‌ కాన్వే (0) ఔట్‌ కాగా.. కేన్‌ విలియమ్సన్‌ (57), డారిల్‌ మిచెల్‌ (31) క్రీజ్‌లో ఉన్నారు. అబ్బాస్‌ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్‌ అఫ్రిది, షాహీన్‌ అఫ్రిదిలకు తలో వికెట్‌ దక్కింది. కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్‌ సెంచరీ సాధించడం విశేషం​.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)