Breaking News

ఇండియాతో మ్యాచ్‌కు అంత హైప్‌ అవసరం లేదు.. పాక్‌ కెప్టెన్‌ అతి వ్యాఖ్యలు

Published on Fri, 07/07/2023 - 12:03

వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియాతో మ్యాచ్‌పై పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఆసక్తికర (అతి) వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్‌ అంటే కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే కాదని, టీమిండియాతో తాము ఆడబోయే మ్యాచ్‌కు అంత హైప్‌ అవసరం లేదని, మెగా టోర్నీలో తాము ఆడబోయే 9 మ్యాచ్‌లూ తమకు ముఖ్యమేనని అన్నాడు. వరల్డ్‌కప్‌లో తమ ఫోకస్‌ ఒక్క జట్టుపై మాత్రమే ఉండదని, తామాడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవడమే తమ లక్ష్యమని తెలిపాడు.

కేవలం ఇండియాపై గెలిస్తే తాము వరల్డ్‌కప్‌ గెలిచినట్లు కాదని, మొత్తం 11 మ్యాచ్‌ల్లో (9 తొలి దశ మ్యాచ్‌లు, సెమీఫైనల్‌, ఫైనల్‌) గెలిస్తేనే జగజ్జేతలమవుతామని పేర్కొన్నాడు. శ్రీలంకతో త్వరలో (జులై 16 నుంచి) ప్రారంభం కాబోయే టెస్ట్‌ సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ పాక్‌ కెప్టెన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబర్‌ 15న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు పాక్‌.. నెదర్లాండ్స్‌, శ్రీలంకలతో అక్టోబర్‌ 6, 12 తేదీల్లో హైదరాబాద్‌లో ఆడుతుంది. అనంతరం అక్టోబర్‌ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో, చెన్నై వేదికగా 23న ఆఫ్ఘనిస్తాన్‌తో, అదే చెన్నై వేదికగా 27న సౌతాఫ్రికాతో, కోల్‌కతా వేదికగా 31న బంగ్లాదేశ్‌తో, బెంగళూరు వేదికగా నవంబర్‌ 4న న్యూజిలాండ్‌తో, కోల్‌కతా వేదికగా నవంబర్‌ 12న ఇంగ్లండ్‌తో పాక్‌ తమ తొలి దశ మ్యాచ్‌లు ఆడుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)