Breaking News

KKR: ద్రవిడ్‌ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్‌?

Published on Fri, 07/12/2024 - 10:10

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.. ఐపీఎల్‌లోని విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరొందింది. ముంబై ఇండియన్స్‌(5), చెన్నై సూపర్‌ కింగ్స్‌(5) తర్వాత అత్యధిక టైటిల్స్‌ సాధించిన రెండో జట్టుగా నిలిచింది.

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కెప్టెన్సీలో 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచిన కోల్‌కతా(కేకేఆర్‌).. ఈ ఏడాది చాంపియన్‌గా నిలిచింది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ఐపీఎల్‌-2024 విజేతగా అవతరించింది.

ఈ విజయంలో కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌తో పాటు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్‌ పాత్ర కూడా కీలకం. ఈ నేపథ్యంలోనే అతడు టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడం విశేషం.

అందుకే రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో
ఇంతవరకు శిక్షకుడిగా పనిచేసిన అనుభవం లేకపోయినా కేకేఆర్‌ విజయం సాధించిన తీరుతో బీసీసీఐ గౌతీపై నమ్మకం ఉంచింది. అందుకే రాహుల్‌ ద్రవిడ్‌ స్థానాన్ని అతడితో భర్తీ చేసింది. శ్రీలంకతో సిరీస్‌ సందర్భంగా గౌతీ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఈ నేపథ్యంలో కేకేఆర్‌ జట్టు కొత్త మెంటార్‌ ఎవరా అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంభీర్‌ స్థానంలో ద్రవిడ్‌ ఈ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇన్నాళ్లుగా ప్రచారం జరగగా.. తాజాగా కొత్త పేరు తెరమీదకు వచ్చింది.

కేకేఆర్‌ మెంటార్‌గా  సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్‌ 
సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్‌ జాక్వెస్‌ కలిస్‌ కేకేఆర్‌ మెంటార్‌గా రానున్నాడని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన విషయం తెలిసిందే.

కేకేఆర్‌ 2012, 2014లో టైటిల్‌ గెలిచిన జట్టులో కలిస్‌ సభ్యుడు. గంభీర్‌ కెప్టెన్సీలో కోల్‌కతాకు ఆడిన ఈ కేప్‌టౌన్‌ స్టార్‌.. 2015లో బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా కొత్త అవతారం ఎత్తాడు.

అనంతరం నాలుగు సీజన్ల పాటు కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌గానూ వ్యహరించాడు. ఈ పదవి నుంచి వైదొలిగన తర్వాత సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా కలిస్‌ నియమితుడయ్యాడు.

ఈ నేపథ్యంలో తమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న జాక్వెస్‌ కలిస్‌తో తిరిగి జట్టు కట్టేందుకు కేకేఆర్‌ యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్‌ స్థానంలో కలిస్‌ను తమ మెంటార్‌గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. 

చదవండి: హెడ్ కోచ్ గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ!.. ఏమిజ‌రిగిందంటే?

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు