Breaking News

ఆసియా కప్‌-2025: టీమిండియాలో అతడి కంటే మొనగాడెవడు?

Published on Mon, 08/18/2025 - 15:52

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) గురించి భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అతడి కంటే మొనగాడు మరొకరు లేరని.. ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌లో శ్రేయస్‌ను తప్పక ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. కాగా సెప్టెంబరు 9- 28 మధ్య ఆసియా కప్‌ టీ20 టోర్నీ జరుగనుంది.

ఈ క్రమంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కకపోవచ్చనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయాలను సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

టీమిండియాలో అతడి కంటే మొనగాడెవడు?
‘‘శ్రేయస్‌ అయ్యర్‌ గురించి కచ్చితంగా చర్చ జరగాలి. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో మధ్య ఓవర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ కంటే గొప్పగా ఆడిన మొనగాడు లేడు.  ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాడు. కావాలనుకున్నపుడు బౌండరీలు బాదుతాడు.

అంతేకాదు.. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌గా ఒత్తిడి పడకుండా తానే అంతా చూసుకుంటాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ శ్రేయస్‌ అదరగొట్టాడు. ఎన్నో అంచనాలు,  ఒత్తిళ్ల నడుమ.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఐపీఎల్‌ ఆడాడు.

వాళ్లంతా అలాగే వచ్చారు కదా!
భారత టీ20 జట్టును ఐపీఎల్‌ ప్రదర్శనల ద్వారానే ఎంపిక చేస్తున్నారు కదా! వరుణ్‌ చక్రవర్తి, రింకూ సింగ్‌, హర్షిత్‌ రాణా, అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌.. ఇలా అందరూ అలా జట్టులోకి వచ్చిన వాళ్లే. కాబట్టి శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఆసియా కప్‌ టీ20 టోర్నీలో ఆడేందుకు అర్హుడు అవుతాడు.

ఇక ప్లేయింగ్‌ ఎలెవన్‌ నుంచి తిలక్‌ వర్మను తప్పించినట్లయితే.. శ్రేయస్‌ అయ్యర్‌ మూడు లేదంటే నాలుగో స్థానంలో సరిగ్గా ఫిట్‌ అవుతాడు. ఒకవేళ శ్రేయస్‌ను ఐదో స్థానంలో ఆడిస్తే.. టీ20 క్రికెట్‌లో అది లోయర్‌ ఆర్డర్‌ లాంటిదే’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో ధనాధన్‌.. ఫటాఫట్‌
కాగా ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా జట్టుకు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదులుకుంది. ఈ క్రమంలో ఈ ముంబై బ్యాటర్‌ వేలంలోకి రాగా.. పంజాబ్‌ కింగ్స్‌ రికార్డు స్థాయిలో రూ. 26.75 కోట్లకు అయ్యర్‌ను కొనుగోలు చేసి సారథిగా నియమించింది.

ఇక ఈ సీజన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌ ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 17 మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే, టైటిల్‌ పోరులో ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడటంతో శ్రేయస్‌, పంజాబ్‌కు భంగపాటు తప్పలేదు.

చదవండి: ఆసియా కప్‌- 2025: అభిషేక్‌ శర్మకు జోడీగా.. వైభవ్‌ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)