ఇంతకంటే ఇంకేం కావాలి: మిచెల్‌ సాంట్నర్‌

Published on Thu, 01/29/2026 - 11:50

టీమిండియాతో టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. విశాఖపట్నంలో బుధవారం జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్‌ సేనను 50 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా భారత్‌ ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది.

టీమిండియా మాదిరే 
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (Mitchell Santner) స్పందించాడు. ‘‘మా ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా పవర్‌ప్లేలో మా వాళ్లు అద్భుతం. టీమిండియా మాదిరే మా ఆటగాళ్లు కూడా పవర్‌ప్లేలో కావాల్సినన్ని పరుగులు రాబట్టారు.

అందుకే మేము మెరుగైన స్కోరు సాధించాము. టీమిండియా లాంటి జట్టుకు 200 మేర లక్ష్యం ఎంతమాత్రం మాకు సురక్షితం కాదు. వాళ్లు సులువుగానే ఈ టార్గెట్‌ను ఛేదించగలరు. గత మ్యాచ్‌లో మాకు ఈ విషయం చాలా బాగా అర్థమైంది.

అద్భుతమైన ఫినిషింగ్‌ టచ్‌
మధ్య ఓవర్లలో మేము వికెట్లు కోల్పోవడం కాస్త ఆందోళన కలిగించింది. అయితే, డారిల్‌ మిచెల్‌, ఫౌల్క్స్‌ అద్భుతమైన ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చారు. భారత్‌లో వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు టీమిండియాతో ఆడటం కంటే గొప్ప సన్నాహకం ఇంకేం ఉంటుంది. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి.

మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంపై దృష్టి సారించాము. వరల్డ్‌కప్‌ టోర్నీలో ఎవరి పాత్ర ఎలా ఉండాలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాము. పవర్‌ ప్లేలో వికెట్లు తీయడం మాకు కలిసి వచ్చింది’’ అని సాంట్నర్‌ జట్టు ‍ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.

ఫిబ్రవరి 7 నుంచి..
కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ‍ప్రపంచకప్‌ టోర్నీ జరుగనుంది. ఇందుకు సన్నాహకంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. హ్యాట్రిక్‌ విజయాలతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

నామమాత్రపు నాలుగో టీ20లో మాత్రం కివీస్‌ చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. సిరీస్‌ కోల్పోయినప్పటికీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ముందు ఊరట దక్కే విజయాన్ని న్యూజిలాండ్‌ అందుకుంది.

భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ నాలుగో టీ20 స్కోర్లు
న్యూజిలాండ్‌-215/7(20)
టీమిండియా- 165(18.4)
ఫలితం: యాభై పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: టిమ్‌ సీఫర్ట్‌ (36 బంతుల్లో 62).

చదవండి: తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)