Breaking News

కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా సంచలన నిర్ణయం

Published on Mon, 08/21/2023 - 19:32

టీమిండియా క్రికెటర్‌, ఐపీఎల్‌-2023లో కేకేఆర్‌ ఫ్రాంచైజీ కెప్టెన్‌ (తాత్కాలిక), దేశవాలీ క్రికెట్‌లో ఢిల్లీ క్రికెట్‌ జట్టు కీలక సభ్యుడైన 29 ఏళ్ల నితీశ్‌ రాణా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అయిన ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్‌ అసోసియేషన్‌తో (DDCA) దశాబ్దకాలానికి పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి దేశవాలీ సీజన్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (UPCA)తో జతకట్టేందుకు నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు అతనికి ఇవాళ (ఆగస్ట్‌ 21) DDCA నుంచి NOC కూడా లభించింది. దీంతో రాణాకు ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌తో అధికారికంగా అనుబంధం తెగిపోయినట్లైంది. త్వరలో ప్రారంభంకానున్న UPT20 Leagueతో రాణా యూపీ క్రికెట్‌ అసోసియేషన్‌తో జతకట్టనున్నాడు. ఈ లీగ్‌ ఇనాగురల్‌ సీజన్‌లో రాణా నోయిడా సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. 

టీమిండియా తరఫున ఓ వన్డే, 2 టీ20లు ఆడిన రాణా.. 2011లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసి 40కి పైగా ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 50కి పైగా లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 100కి పైగా టీ20లు  ఆడాడు. రాణా తన దేశవాలీ కెరీర్‌లో మొత్తంగా 9 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు సాధించాడు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌తో బంధం తెంచుకున్న తర్వాత రాణా ఉద్వేగంతో ఓ ట్వీట్‌ చేశాడు.

ఆన్‌ టు ద నెక్స్ట్‌ చాప్టర్‌ అని క్యాప్షన్‌ జోడిండి DDCAతో ఉండిన అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు. ఈ ట్వీట్‌లో అతను DDCAలో తనకు సహకరించిన ప్లేయర్స్‌, నాన్‌ ప్లేయర్స్‌ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కాగా, రాణా గత ఐపీఎల్‌ సీజన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ గైర్హాజరీలో కేకేఆర్‌కు సారధిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)