Breaking News

సౌతాఫ్రికాను చిత్తు చేసిన భార‌త్‌

Published on Sun, 11/16/2025 - 20:15

రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికా 'ఎ' తో జరిగిన రెండో అనధికారిక వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ 'ఎ' ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన  దక్షిణాఫ్రికా 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు విలవిల్లాడారు.  స్పిన్నర్ నిశాంత్ సింధు 4 వికెట్లు పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా 3, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్‌స్వామి(33) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పొటిగిటర్‌(23), ప్రిటోరియస్‌(21) రాణించారు.

రుతురాజ్ మెరుపులు.. 
అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండియా జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 27.5 ఓవర్లలో చేధించింది. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 9 ఫోర్లతో 68) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుథో సిపామ్లా ఒక్కడే వికెట్ సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో అనధికారిక వన్డే రాజ్‌కోట్ వేదికగానే నవంబర్ 19న జరగనుంది.
చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్‌
 

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు