Breaking News

విండీస్‌తో​ రెండో టెస్టు.. న్యూజిలాండ్‌ ఘన విజయం

Published on Fri, 12/12/2025 - 12:27

వెల్లింగ్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకెండ్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. 56 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని బ్లాక్‌క్యాప్స్ కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి చేధించింది. డెవాన్ కాన్వే(28), కేన్ విలియ‌మ్స‌న్‌(16) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 205 ప‌రుగుల‌కు ఆలౌటైంది. విండీస్ బ్యాట‌ర్ల‌లో షాయ్ హోప్‌(47) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. క్యాంప్‌బెల్‌(44) , కింగ్‌(33) రాణించారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో టిక్న‌ర్ నాలుగు, రే మూడు వికెట్లు సాధించారు.

అనంత‌రం కివీస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 278/9 వద్ద ముగించింది. ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడ్డ పేసర్‌ టిక్నర్‌ బ్యాటింగ్‌కు రాలేదు. మిచెల్‌ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్‌), డెవాన్‌ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు 73 పరుగుల ఆధిక్యం లభించింది. కరీబియన్‌ బౌలర్లలో అండర్సన్‌ ఫిలిప్‌ 3, రోచ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో విండీస్‌ కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. కివీ పేసర్‌ జాకబ్‌ డఫీ 5 వికెట్లు పడగొట్టి కరేబియన్ల పతనాన్ని శాసించాడు. 

అతడితో పాటు మిచెల్ రే మూడు వికెట్లు సాధించాడు. కవీమ్‌ హోడ్జ్‌(35) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో విండీస్‌ ఆతిథ్య జట్టు ముందు కేవలం 56 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మౌంట్ మంగునూయ్ వేదికగా డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)