సెమీస్‌ సమరానికి సిద్ధం

Published on Wed, 03/04/2026 - 04:00

టి20 ప్రపంచ కప్‌ చరిత్రలో రెండు టీమ్‌లదీ దాదాపు ఒకే రకమైన పరిస్థితి...ఇరు జట్లు ఒక్కో సారి ఫైనల్‌ వరకు చేరగలిగినా టైటిల్‌ గెలుచుకోలేక రన్నరప్‌గానే సంతృప్తి చెందాయి. లీగ్‌ దశలో అద్భుతంగా ఆడుతున్నా, ప్రత్యర్థి జట్లకు సవాల్‌ విసురుతున్నా అసలు సమయంలో మాత్రం ఈ టీమ్‌లు చేతులెత్తేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో మరోసారి ఫైనల్‌ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ సిద్ధమయ్యాయి. రెండు టీమ్‌లలో ఒకరికి మాత్రమే టైటిల్‌ వేటలో పోటీ పడేందుకు  అవకాశం ఉంది. ఈ క్రమంలో తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లూ సై అంటున్నాయి.  ఈడెన్‌ గార్డెన్స్‌లో హోరాహోరీ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరం. 

కోల్‌కతా: టి20 వరల్డ్‌ కప్‌ తొలి నాకౌట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్‌ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో కూడా విజయాలు సాధించే దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్‌ చేరగా...కివీస్‌ ప్రస్థానం మాత్రం తడబడుతూ సాగింది. 

లీగ్‌ దశలో మూడు బలహీన జట్లను ఓడించిన న్యూజిలాండ్, సూపర్‌ ఎయిట్స్‌లో ఒకటే విజయంతో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దక్షిణాఫ్రికా అలవోక విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరుతుందా లేక గత మ్యాచ్‌కు కివీస్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి.  

అద్భుత ఫామ్‌లో... 
2024 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో దాదాపు చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించి అనూహ్యంగా ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారి మెగా టోర్నీకి బాగా సన్నద్ధమై వచ్చినట్లు కనిపించింది. ప్రత్యర్థులకు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ జట్టు చెలరేగిపోతోంది. అఫ్గనిస్తాన్‌పై పోరు సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లినా...భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను ఓడించిన తీరు జట్టు బలాన్ని చూపించింది. కెప్టెన్‌ మార్క్‌రమ్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. 

టాపార్డర్‌లో డికాక్, రికెల్టన్‌లనుంచి అతనికి సరైన మద్దతు లభిస్తోంది. బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్‌లతో మిడిలార్డర్‌ చాలా పటిష్టంగా ఉంది. మిల్లర్‌ చాలా కాలంగా నిలకడగా రాణిస్తుండగా, బ్రెవిస్‌ మెరుపు బ్యాటింగ్‌తో ఏ టీమ్‌పైనైనా చెలరేగిపోగలడు. యాన్సెన్, బాష్‌ రూపంలో ఇద్దరు చక్కటి ఆల్‌రౌండర్లు ఉండటం జట్టు బలాన్ని పెంచింది. బౌలింగ్‌లో ఇద్దరు బెస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్లు జట్టును నడిపిస్తున్నారు. 

రబాడ, ఎన్‌గిడి ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి కోలుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన ఆటను అమాంతం మెరుగుపర్చుకున్న ఎన్‌గిడి ‘స్లో బంతులు’ బ్యాటర్లకు పెద్ద సమస్యగా మారాయి. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా కేశవ్‌ మహరాజ్‌ తన సత్తాను ప్రదర్శిస్తున్నాడు. ఓవరాల్‌గా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సఫారీలకే గెలుపు సానుకూలత ఎక్కువగా ఉంది.  

తడబడుతూనే... 
ప్రత్యర్థితో పోలిస్తే న్యూజిలాండ్‌ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు బలాబలాల్లో ఏ జట్టుకూ కూడా తీసిపోనట్లు కనిపించిన కివీస్‌ అసలు సమయంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శనను చూపించలేకపోయింది. ఏ ఆటగాడు కూడా ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించేలా కనిపించడం లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా జట్టులో తడబాటు కనిపిస్తూనే ఉంది. టాప్‌–3 బ్యాటర్లు సీఫెర్ట్, అలెన్, రచిన్‌లలో ఎవరూ గొప్పగా ఆడలేదు. 

ఫిలిప్స్‌లో కూడా నిలకడ లోపించగా...చాప్‌మన్‌ పూర్తిగా విఫలమయ్యాడు. ఇటీవల భారత్‌తో సిరీస్‌లో చెలరేగిన మిచెల్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోగా...కెపె్టన్‌ సాంట్నర్‌ వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. బౌలింగ్‌లో విఫలమైన సాంట్నర్‌ బ్యాటింగ్‌లో కూడా ఒక్క ఇన్నింగ్స్‌ మినహా ఎక్కడా బాగా ఆడలేదు. ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం జట్టు బలహీనతలను స్పష్టంగా చూపించింది. 

బౌలింగ్‌లో ఫెర్గూసన్‌పైనే ప్రధానంగా పేస్‌ భారం ఉంది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన హెన్రీ సెమీస్‌ వరకు తిరిగి వస్తాడని మేనేజ్‌మెంట్‌ చెప్పినా, దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక వేళ హెన్రీ రాకపోతే అతని స్థానంలో డఫీ బరిలోకి దిగుతాడు. కివీస్‌ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో ఆడుతున్నా ఒక్కరు కూడా ప్రమాదకరంగా కనిపించడం లేదు. అందరూ ధారాళంగా పరుగులిస్తున్నారు.  

తుది జట్లు (అంచనా) 
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బాష్, రబాడ, మహరాజ్, ఎన్‌గిడి  
న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్‌), సీఫెర్ట్, అలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, మెక్‌కోన్‌కీ, సోధి, ఫెర్గూసన్, హెన్రీ / డఫీ

5-0 టి20 వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా...ఐదు కూడా దక్షిణాఫ్రికానే గెలిచింది. 

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావంతక్కువగా ఉన్నా సరే ఇక్కడ ఛేదన చాలా సులువు. భారత్, విండీస్‌ మధ్య పోరులో కూడా ఇది కనిపించింది. మ్యాచ్‌ రోజు వర్ష సూచన లేదు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)