Breaking News

సత్తా చాటిన అలెన్‌, మిల్నే..  పాక్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

Published on Sun, 01/14/2024 - 15:33

ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ పాకిస్తాన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించింది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టును 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన కివీస్‌.. హ్యామిల్టన్‌ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో టీ20లో పాక్‌ను 21 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. ఫిన్‌ అలెన్‌ (41 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో అలెన్‌ మినహా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. విలియమ్సన్‌ (26 రిటైర్డ్‌ హర్ట్‌), సాంట్నర్‌ (25), కాన్వే (20), డారిల్‌ మిచెల్‌ (17), గ్లెన్‌ ఫిలిప్‌ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్‌ అఫ్రిది 2, ఆమిర్‌ జమాల్‌, ఉసామా మిర్‌, షాహీన్‌ అఫ్రిది తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

లక్ష్య ఛేదనలో తడబడిన పాక్‌.. 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కివీస్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్నే (4-0-33-4) పాక్‌ పతనాన్ని శాశించగా.. సౌథీ, బెన్‌ సియర్స్‌, సోధి తలో రెండు వికెట్లతో రాణించారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (66), ఫకర్‌ జమాన్‌ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. షాహీన్‌ అఫ్రిది (22) రెండంకెల స్కోర్‌ చేశాడు. ఈ ముగ్గురు మినహా పాక్‌ ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు. సైమ్‌ అయూబ్‌ 1, రిజ్వాన్‌ 7, ఇఫ్తికార్‌ అహ్మద్‌ 4, ఆజం ఖాన్‌ 2, ఆమిర్‌ జమాల్‌ 9, అబ్బాస్‌ అఫ్రిది 7, ఉసామా మిర్‌ 0, హరీస్‌ రౌఫ్‌ 2 నాటౌట్‌ పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జనవరి 17న డెనెడిన్‌ వేదికగా జరుగుతుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)