Breaking News

శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన భారత్‌

Published on Mon, 03/13/2023 - 12:23

డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్‌ మాజీ సారధి కేన్‌ విలియమ్సన్‌ నీళ్లు చల్లాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన సూపర్‌ సెంచరీ సాధించిన కేన్‌ మామ (121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కేన్‌ మామ ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేసి, తన జట్టును 2 వికెట్ల తేడాతో గెలిపించుకున్నాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 

మరోపక్క ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో భారత్‌ విజయావకాశాలు సన్నగిల్లడంతో,  న్యూజిలాండ్‌-శ్రీలంక తొలి టెస్ట్‌ ఫలితంపై డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు ఆధారపడి ఉండింది. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లోనూ శ్రీలంక గెలిచి ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరి ఉండేది.

అయితే, తొలి టెస్ట్‌లోనే లంక ఓటమిపాలుకావడంతో ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా దర్జాగా ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది జూన్‌ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. శ్రీలంక నిర్ధేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. కేన్‌ విలియమ్సన్‌ (121 నాటౌట్‌), డారిల్‌ మిచెల్‌ (81) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆఖరి బంతికి విజయాన్ని ఖరారు చేసుకుంది. ముఖ్యంగా కేన్‌ మామ అన్నీ తానై వ్యవహరించి, చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలిచి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్‌కు విన్నింగ్‌ రన్‌ ఎక్స్‌ట్రా (బై) రూపంలో రావడం విశేషం. 

స్కోర్‌ వివరాలు..
శ్రీలంక: 355 & 302
న్యూజిలాండ్‌: 373 & 285/8
ఫలితం: 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విజయం
 

Videos

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)