Breaking News

వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్‌.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని

Published on Thu, 05/01/2025 - 09:32

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ప్రయాణం ముగిసిపోయింది. పంజాబ్‌ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత ధోని సేన అధికారికంగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

పంజాబ్‌తో మ్యాచ్‌లో తమ బ్యాటర్లు మెరుగ్గానే ఆడారని.. అయితే, కనీసం ఇంకో 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ఈరోజు తొలిసారి మా బ్యాటర్లు స్కోరు బోర్డుపై మెరుగైన సంఖ్యను ఉంచారు. కానీ ఇలాంటి పిచ్‌పై ఇది సరిపోదు.

ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాం
మా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేది. అదే విధంగా మేము కీలక సమయాల్లో కీలక క్యాచ్‌లు జారవిడవడం కూడా ప్రభావం చూపింది.

ఏదేమైనా ఈరోజు బ్రెవిస్‌, సామ్‌ అద్భుతంగా ఆడి విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, మేము దురదృష్టవశాత్తూ ఆలౌట్‌ అయ్యాము. ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాం. అంతకంటే ముందు మా వాళ్లు నలుగురు అవుట్‌ అయ్యారు.

అతడొక పోరాట యోధుడు
ఇలాంటి కీలక పోరులో ఒక్క బంతి ఆడటం కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పుతుంది’’ అని ధోని పేర్కొన్నాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో అద్భుత అర్థ శతకంతో మెరిసిన సామ్‌ కరన్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడొక పోరాట యోధుడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా కచ్చితంగా రాణిస్తాడు.

అయితే, దురదృష్టవశాత్తూ పిచ్‌ దృష్ట్యా అతడికి ఎక్కువగా ఛాన్సులు ఇవ్వలేకపోయాం. కానీ ఈరోజు మా సొంతమైదానంలో టోర్నీలోనే అత్యుత్తమ వికెట్‌ మీద ఆడి తానేంటో నిరూపించుకున్నాడు.

అతడొక అద్భుతమైన ఫీల్డర్‌ కూడా
మేము ఇంకొక్క పదిహేను పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని ధోని అన్నాడు. అదే విధంగా అద్భుత ఫీల్డింగ్‌ నైపుణ్యాలు కనబరిచిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మిడిలార్డర్‌లో తను మొమెంటమ్‌ తీసుకువచ్చాడు.

చిన్న అవకాశం దొరికినా బంతిని బౌండరీకి తరలించాలని చూస్తాడు. అంతేకాదు.. అతడొక అద్భుతమైన ఫీల్డర్‌ కూడా. జట్టులో సరికొత్త ఉత్సాహం నింపుతున్నాడు. అతడి ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాము. భవిష్యత్తులో అతడొక విలువైన ఆస్తిగా మారతాడు’’ అని ధోని ఈ సౌతాఫ్రికా యువ బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు.

 

సీఎస్‌కేకే ఇదే తొలిసారి
కాగా చెపాక్‌ స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసింది చెన్నై. ఓపెనర్లు షేక్‌ రషీద్‌ (11), ఆయుశ్‌ మాత్రే (7) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన 
సామ్‌ కరన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

మొత్తంగా 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా డెవాల్డ్‌ బ్రెవిస్‌ (32) రాణించాడు. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లో 190 పరుగులు చేసి చెన్నై జట్టు ఆలౌట్‌ అయింది.

ఇక ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నైని ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకొనేలా చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో బేబీ ఏబీడీ బ్రెవిస్‌ అద్భుతమైన క్యాచ్‌లతో మెరిశాడు. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (54) ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు.

అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శశాంక్‌ సింగ్‌ (23) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్న బ్రెవిస్‌ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. బౌండరీ లైన్‌కు తాకే ప్రమాదం ఉండటంతో బంతిని మూడుసార్లు గాల్లోకి లేపి ఆ తర్వాత సురక్షితంగా క్యాచ్‌ పట్టాడు. కాగా గతేడాది కూడా చెన్నై టాప్‌-4కు చేరలేదన్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు సీజన్లలో చెన్నై ప్లే ఆఫ్స్‌ చేరకపోవడం ఇదే తొలిసారి.

చదవండి: క్రికెట్‌ నీకు రెండో ఛాన్స్‌ ఇచ్చింది.. కానీ..

 

Videos

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)