Breaking News

గెలిచామ‌న్న గ‌ర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్‌!

Published on Wed, 06/10/2026 - 10:24

బంగ్లాదేశ్ త‌మ సొంత‌గ‌డ్డ‌పై ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 21 ఏళ్ల త‌ర్వాత ఆసీస్‌ను మ‌ట్టిక‌రిపించిన బంగ్లాదేశ్ మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే గెలిచామ‌న్న గ‌ర్వమో లేక పొగ‌రో తెలియ‌దు కానీ బంగ్లాదేశ్ బౌల‌ర్ న‌హిద్ రానా ఆస్ట్రేలియా కెప్టెన్ జోస్ ఇంగ్లిస్‌ను స్లెడ్జింగ్ చేయ‌డం మ్యాచ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 

విష‌యంలోకి వెళితే.. 285 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెన‌ర్ మాథ్యూ షార్ట్ గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరగ్గా, మార్న‌స్ ల‌బుషేన్ కూడా వెంట‌నే పెవిలియ‌న్ చేరాడు. దీంతో కూప‌ర్‌కు జ‌త క‌లిసిన ఇంగ్లిస్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. వీరి మ‌ధ్య భాగ‌స్వామ్యం బ‌ల‌పడుతున్న త‌రుణంలో న‌హీద్ రానా 11వ ఓవ‌ర్లో బౌలింగ్‌కు వ‌చ్చాడు. 

ఆ ఓవ‌ర్ తొలి బంతికే ఇంగ్లిస్‌ను పెవిలియ‌న్ చేర్చాడు. ఔట్‌సైడ్ అయిన బంతిని షాట్ ఆడే ప్ర‌య‌త్నంలో ఇంగ్లిస్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇంగ్లిస్ పెవిలియ‌న్ వైపు వెళుతున్న త‌రుణంలో న‌హీద్ రానా అత‌డిని ఉద్దేశించి ఏదో అన్నాడు. ఇది విన్న ఇంగ్లిస్ నేరుగా న‌హీద్ రానావైపు దూసుకొచ్చి ఘాటుగానే స‌మాధాన‌మిచ్చాడు. ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చిన బంగ్లా కెప్టెన్ మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ ఇంగ్లిస్‌ను అడ్డుకొని అక్క‌డి నుంచి పంపించేశాడు. 

ఆ త‌ర్వాత న‌హీద్ రానా వ‌ద్దకు వ‌చ్చిన మెహదీ హ‌స‌న్‌.. ఎమోష‌న్ కంట్రోల్ చేసుకో అని అన‌డం స్టంప్ మైక్‌లో రికార్డ‌యింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఆరో నంబర్‌ ఆటగాడు మొసద్దెక్‌ హొస్సేన్‌ (86 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.  

బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (54), నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఇల్లిస్ 3 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడాడు. 

బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగుల వ‌ద్ద ఉన్న‌ప్పుడు వర్షం​ అంతరాయం కలిగించింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. 

చదవండి: 'అత‌డు పేరుకే ఆల్‌రౌండ‌ర్‌.. జ‌ట్టులో ప్లేస్ దండుగ'

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)