Breaking News

శ్రేయస్‌తో చహల్‌ భార్య ధనశ్రీ తాజా ఫొటో వైరల్‌! కలిసి వెళ్లేది అందుకేనా?

Published on Sat, 04/08/2023 - 17:02

Shreyas Iyer- Yuzvendra Chahal- Dhanashree Verma: గాయం కారణంగా ఐపీఎల్‌-2023కి దూరమైన టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌, కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఫొటోలు తాజాగా వైరల్‌ అవుతున్నాయి. భారత స్టార్‌ స్పిన్నర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ కీలక బౌలర్‌ యజువేంద్ర చహల్‌ భార్య, యూట్యూబర్‌ ధనశ్రీ వర్మతో అయ్యర్‌ కలిసి దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ధనశ్రీ స్వయంగా శనివారం తన ఇన్‌స్టా స్టోరీలో వీటిని షేర్‌ చేయడం గమనార్హం.

‘‘మై క్యూటీస్‌’’ అంటూ హార్ట్‌ ఎమోజీతో తన స్నేహితురాలు పంచుకున్న ఫొటోను చహల్‌ సతీమణి షేర్‌ చేసింది. ఇందులో ఆమె స్నేహితులతో పాటు ఓ మూలన అయ్యర్‌ కూడా కనిపించాడు. ఇందులో శ్రేయస్‌ సోదరి శ్రేష్ట అయ్యర్‌ కూడా ఉండటం విశేషం. కాగా గతంలో.. టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌- దేవిషా దంపతులతో ధనశ్రీ, శ్రేయస్‌ దిగిన ఫొటోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

విడాకుల రూమర్లు
అంతకుముందే ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి చహల్‌ ఇంటి పేరును తొలగించడం.. తర్వాత ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ కావడంతో విడాకుల రూమర్లు గుప్పుమన్నాయి. దీంతో స్వయంగా చహల్‌- ధనశ్రీ స్పందిస్తూ పుకార్లకు అడ్డుకట్ట వేశారు.

అయితే, ఇటీవల టీమిండియా పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ పెళ్లిలోనూ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- రితికా దంపతులతో కలిసి ధనశ్రీ- శ్రేయస్‌ దిగిన ఫొటోలతో మరోసారి వీరు నెట్టింట ట్రెండ్‌ అయ్యారు. తాజాగా స్నేహితుల ఇంట్లో జరిగిన ఇఫ్తార్‌ పార్టీకి శ్రేయస్‌, శ్రేష్టతో పాటు ధనశ్రీ కూడా హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో మళ్లీ వీరి పేర్లు హైలైట్‌ అవుతున్నాయి.

కలిసి వెళ్లేది అందుకేనా..
డాక్టర్‌ ధనశ్రీ వర్మ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌. అలాగే కొరియోగ్రాఫర్‌ కూడా! నిజానికి శ్రేయస్‌ సోదరి శ్రేష్ట కూడా కొరియాగ్రాఫర్‌గా రాణించాలని కలలు కంటోంది. ఈ క్రమంలో వీరిద్దరికి స్నేహం కుదరగా.. శ్రేయస్‌తో కూడా ధనశ్రీ ఫ్రెండ్‌షిప్‌ చేయడం మొదలుపెట్టిందని టాక్‌.

ఇప్పటికే అయ్యర్‌తో గతంలో ఓ డాన్స్‌ వీడియో షేర్‌ చేసిన ధనశ్రీ అతడి ఆట తీరును ప్రశంసిస్తూ పోస్ట్‌ పెట్టింది. దీంతో కొంతమంది అయ్యర్‌తో ధనశ్రీ స్నేహాన్ని విమర్శిస్తూ కామెంట్లు చేస్తుండగా.. అభిమానులు మాత్రం తన ఫ్రెండ్‌ సోదరుడితో ధనశ్రీ ఫ్రెండ్‌షిప్‌ చేస్తే పెడర్థాలు తీస్తారా అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. ఏదేమైనా.. ఏదో రకంగా వార్తల్లో ఉండటం ధనశ్రీకి పరిపాటి అయిందని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు.

తను దొరకడం నా అదృష్టం
ధనశ్రీ వీలు చిక్కినప్పుడల్లా భర్త చహల్‌తో కలిసి ప్రయాణాలు చేస్తుంది. అతడిని ప్రోత్సహిస్తూ భర్త సాధించే విజయాలను ఆస్వాదిస్తుంది. ఇటీవల సన్‌రైజర్స్‌తో హైదరాబాద్‌లో రాజస్తాన్‌ మ్యాచ్‌కు విచ్చేసిన ధనశ్రీ.. చహల్‌ వికెట్లు తీసినపుడు సెలబ్రేషన్‌ చేసుకున్న తీరు హైలైట్‌గా నిలిచింది. ఇక మ్యాచ్‌ తర్వాత చహల్‌ మాట్లాడుతూ.. తన భార్య గురించి గొప్పగా చెబుతూ.. ఆమెలాంటి జీవిత భాగస్వామి దొరకడం అదృష్టమని పొంగిపోయాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో చహల్‌ బిజీగా ఉన్న సమయంలో ధనశ్రీ ఫొటోలు షేర్‌ చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)