బంగ్లాదేశ్‌కు మరో షాకిచ్చిన జింబాబ్వే

Published on Wed, 07/15/2026 - 20:49

బంగ్లాదేశ్‌పై టెస్ట్, వన్డే సిరీస్‌ల విజయాల జోరు కొనసాగించిన జింబాబ్వే టీ20 సిరీస్‌ను కూడా ఘనంగా ప్రారంభించింది. బులవాయో వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో పర్యాటక జట్టును 32 పరుగుల తేడాతో ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. పేసర్లు బ్లెస్సింగ్ ముజరబానీ (4/17), రిచర్డ్ నగరవా (4/26) అద్భుత బౌలింగ్‌తో బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.

బెన్నెట్ మెరుపులు
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 44 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, టాడివానాషే మరుమానీ కూడా మెరుపులు (2 సిక్సర్లు) మెరిపించాడు. మధ్యలో ర్యాన్ బర్ల్ 30 పరుగులతో జట్టును నిలబెట్టాడు. చివర్లో బ్రాడ్ ఇవాన్స్ అజేయంగా 19 పరుగులు చేసి స్కోరును 20 ఓవర్లలో 170/6కు చేర్చాడు.

బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రాణా మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ, చివరి ఓవర్లో వరుస బౌండరీలు ఇవ్వడంతో జింబాబ్వే భారీ స్కోరు సాధించింది.

ముజరబానీ, నగరవా ధాటికి కుప్పకూలిన బంగ్లాదేశ్‌
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిచర్డ్ నగరవా వరుసగా రెండు వికెట్లు తీయగా, వెంటనే ముజరబానీ మరో దెబ్బ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 43/3తో కష్టాల్లో పడింది.

యాసిర్ అలీ (54), తౌహిద్ హృదయ్ కలిసి పోరాడినా, కీలక సమయంలో భాగస్వామ్యం విరగడంతో మ్యాచ్ పూర్తిగా జింబాబ్వే వైపు మళ్లింది. చివర్లో ముజరబానీ, నగరవా మరోసారి వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను 19 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 జులై 17న జరుగనుంది. 
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)