Breaking News

న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్‌.. 214 పరుగుల తేడాతో ఘన విజయం

Published on Tue, 01/30/2024 - 20:25

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌-2024లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీ సూపర్‌ సిక్స్‌ దశను విజయంతో ఆరంభించింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగా బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 214 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. భారత విజయంలో ముషీర్‌ ఖాన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్‌.. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131 ముషీర్‌ పరుగులు చేశాడు.

అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.  ముషీర్‌తో పాటు ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌(52), కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌(34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మాసేన్‌ క్లార్క్‌ 4 వికెట్లు పడగొట్టగా.. ఒలీవర్‌ తెవాటియా, కమ్మింగ్‌, రెయాన్‌ తలా వికెట్‌ సాధించారు.

4 వికెట్లతో చెలరేగిన సౌమ్య పాండే..
296 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. భారత బౌలర్ల దాటికి కేవలం 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్‌ సౌమ్య పాండే 4 వికెట్లతో బ్లాక్‌క్యాప్స్‌ పతనాన్ని శాసించగా.. రాజ్‌ లింబానీ, ముషీర్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ జాక్‌సన్‌(19) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)