Breaking News

ముషీర్‌ ఖాన్‌ సంచలనం

Published on Wed, 10/28/2026 - 14:48

ముంబై ఆల్‌రౌండర్‌ ముషీర్‌ ఖాన్‌ సంచలనం సృష్టించాడు. రంజీ ట్రోఫీలో అరుదైన ఘనత సాధించాడు. హర్యానాతో జరుగుతున్న గ్రూప్-డి మ్యాచ్‌లో తొలుత సెంచరీతో సత్తా చాటిన ముషీర్‌, ఆ తర్వాత బంతితోనూ అదరగొట్టి ఐదు వికెట్లు పడగొట్టాడు.

తద్వారా ఓ రంజీ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టిన ఆరో ముంబై ఆటగాడిగా నిలిచాడు. చివరిసారిగా 1990-91 సీజన్‌లో భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రి ముంబై తరఫున ఈ ఘనత సాధించాడు. 36 ఏళ్ల తర్వాత ముషీర్‌ ఈ ఫీట్‌ను పునరావృతం​ చేశాడు.

ముంబై తరఫున ఒకే రంజీ మ్యాచ్‌లో సెంచరీ, ఐదు వికెట్ల ఘనత సాధించిన ఆటగాళ్లు 
- మదన్ రైజీ: మహారాష్ట్రపై, 1947-48
- దత్తు ఫడ్కర్: మద్రాస్‌పై, 1948-49
- వినూ మన్కడ్: మద్రాస్‌పై, 1953-54
- పాలీ ఉమ్రిగర్: మహారాష్ట్రపై, 1957-58
- రవిశాస్త్రి: మధ్యప్రదేశ్‌పై, 1990-91
- ముషీర్ ఖాన్: హర్యానాపై, 2026-27

మ్యాచ్‌ విషయానికొస్తే.. ముషీర్‌ (109)తో పాటు అంగ్‌కృష్‌ రఘువంశీ (114) సెంచరీలతో కదంతొక్కడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ముషీర్‌ బంతితోనూ (6-78) చెలరేగడంతో హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపిస్తుంది. మూడో రోజు రెండో సెషన్‌ సమయానికి ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 168 పరుగులు వెనుకపడి ఉంది. 

ఇదీ చదవం‍డి: విండీస్‌తో టెస్టు.. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ అరుదైన రికార్డు


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)