Breaking News

భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు జట్టును ప్రకటించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు

Published on Thu, 02/05/2026 - 13:52

క్రికెట్‌ అభిమానులను ఇది కన్‌ఫ్యూజ్‌ చేసే వార్త. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు జట్టును ప్రకటించింది. అదేంటి.. ఆ రోజు భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్‌ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది కాదా అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. అంత​​కుముందు వార్త కూడా నిజమే.

వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 15న భారత్‌-పాక్‌ మధ్య రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. పాక్‌ ప్రభుత్వం పురుషుల టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. మరో ​మ్యాచ్‌ మహిళల ఏసీసీ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భాగంగా జరగాల్సి ఉంది.

ఈ మ్యాచ్‌కు పాక్‌ ప్రభుత్వం నుంచి కాని, ఆ దేశ క్రికెట్‌ బోర్డు నుంచి కాని ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ మ్యాచ్‌తో పాటు టోర్నీ మొత్తం కోసమే పీసీబీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉమ్మె-హాని ఎంపికైంది.

ఈ జట్టులో ఎమాన్ నసీర్, గుల్ రుఖ్, హఫ్సా ఖలీద్, హురైనా సజ్జాద్, షావాల్ జుల్ఫికార్ కీలక బ్యాటర్లు. వికెట్ కీపర్లుగా కోమల్ ఖాన్, యుస్రా ఆమిర్ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్లుగా నూరీన్ యాకూబ్, ఉమ్మె-హాని ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అనోషా నసీర్, లుబ్నా బెహ్రామ్, నేహా షర్మిన్ నదీమ్ , సయిదా మసూమా జాఫ్రీ , వహీదా అఖ్తర్ ఆ జట్టు బలంగా ఉంది.  

రిజర్వ్ ప్లేయర్లుగా జునాష్ అబ్దుల్ సత్తార్, మహమ్ అనీస్, అంబర్ కైనాత్, ఆయేషా బిలాల్ ఎంపికయ్యారు.

ఈ టోర్నీలో పాక్‌ షెడ్యూల్‌ ఇలా ఉంది. 
ఫిబ్రవరి 13 – పాకిస్తాన్ ‘A’ vs నేపాల్ (ఉదయం 9.30)  
ఫిబ్రవరి 15 – పాకిస్తాన్ ‘A’ vs ఇండియా ‘A’ (మధ్యాహ్నం 2.00)  
ఫిబ్రవరి 17 – పాకిస్తాన్ ‘A’ vs UAE (మధ్యాహ్నం 2.00)  

అన్ని మ్యాచ్‌లు బ్యాంకాక్‌లో జరగనున్నాయి.  

ఇదిలా ఉంటే, ఈ టోర్నీలో భారత ఏ జట్టు కూడా ఫిబ్రవరి 13నే తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌, మలేసియా, థాయ్‌లాండ్‌ గ్రూప్‌-బిలో ఉండగా.. పాక్‌, భారత్‌, యూఏఈ, నేపాల్‌ జట్లు గ్రూప్‌-ఏలో ఉన్నాయి. గ్రూప్‌ దశలో భారత్‌ ఫిబ్రవరి 13న యూఏఈతో, 15న పాకిస్తాన్‌తో, 17న నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ రాధా యాదవ్‌ వ్యవహరించనుంది.

 

Videos

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు