Breaking News

ఆసియాక‌ప్ ట్రోఫీ ఎత్తుకెళ్లాడు.. క‌ట్ చేస్తే! న‌ఖ్వీ పోస్ట్ ఊస్టింగ్‌?

Published on Fri, 10/10/2025 - 21:33

2025 ఆసియా కప్.. ఈ ఖండాతర టోర్నీ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఎడిషన్‌గా నిలిచింది. షేక్ హ్యాండ్ వివాదం మొదలు ఆసియా కప్ ట్రోఫీ వరకూ ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠ‌ను రేపింది. పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిరస‌న‌గా పాక్ ఆట‌గాళ్ల‌తో భార‌త జ‌ట్టు అంటిముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించింది. 

తొలుత షేక్ హ్యాండ్స్ ఇవ్వ‌డానికి నిరాక‌రించిన భార‌త్‌.. ఆ త‌ర్వాత ఏసీసీ చైర్మెన్‌, పీసీబీ చీఫ్ మోహ్స‌న్ న‌ఖ్వీ(mohsin naqvi) చేతుల మీద‌గా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి స‌ముఖ‌త చూప‌లేదు. నక్వీ తన చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలని ప‌ట్టుబ‌ట్టిన‌ప్ప‌టికి బీసీసీఐ ఆదేశాల మేర‌కు టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ అందుకు అంగీక‌రించ‌లేదు.

దీంతో న‌ఖ్వీ స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విజేతల పతకాలను కూడా తీసుకెళ్లడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్ప‌టికి ఇంకా ట్రోఫీని భార‌త్‌కు అత‌డు అంద‌జేయ‌లేదు. ట్రోఫీ ప్ర‌స్తుతం దుబాయ్‌లోని ఏసీసీ ఆఫీస్‌లో ఉంది.  త‌న అనుమ‌తి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్ప‌గించ‌కూడ‌ద‌ని ఏసీసీ అధికారుల‌కు న‌ఖ్వీ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చాడు. 

న‌ఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవ‌డం, ఇంకా అంద‌జేయ‌క‌పోవ‌డంపై బీసీసీఐ గుర్రుగా ఉంది.  వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐ లేవ‌నెత్తునుంది. అంతేకాకుండా ఐసీసీ డైరెక్టర్ పదవి నుండి అత‌డిని తొలిగించాల‌ని భార‌త క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది.

న‌ఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు  ఐసీసీ డైరెక్టర్ గానూ కొన‌సాగుతున్నాడు. కాగా ఐసీసీ చైర్మెన్‌గా జై షా ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో న‌ఖ్వీ డైర‌క్ట‌ర్ ప‌దవి ఊడిపోవ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం సాగుతోంది.

"ఆసియాక‌ప్ టోర్నీకి అధికారిక హోస్ట్‌గా ఉన్న బీసీసీఐకి ట్రోఫీని పంప‌డానికి నిరాకరించే హ‌క్కు న‌ఖ్వీకి లేదు. అత‌డు ట్రోఫీని భార‌త్‌కు ఇప్ప‌టికే పంపించాల్సింది. కానీ అందుకు అత‌డు ఒప్పుకోవ‌డం లేదు. కాబ‌ట్టి అందుకు న‌ఖ్వీ భారీ మూల్యం చెల్లించుకోనున్నాడు" అని బీసీసీఐ వ‌ర్గాలు పేర్కొన్నాయి.
చదవండి: ఐపీఎల్‌లో అద‌ర‌గొట్టాడు.. క‌ట్ చేస్తే! ఇప్పుడు ఊహించ‌ని జాక్ పాట్‌

Videos

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు