Breaking News

మహ్మద్ షమీకి ఈసీ నోటీసులు

Published on Mon, 01/05/2026 - 19:34

టీమిండియా వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ, అత‌డి సోదురుడు మహ్మద్‌ కైఫ్‌కి కేంద్ర ఎన్నికల సంఘం స‌మన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం ఓటరు జాబితాల సవరణలో భాగంగా స్పెషల్‌ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ జరుగుతోంది.

అయితే ష‌మీ, కైఫ్ సమర్పించిన ఎన్యుమరేషన్ ఫారమ్‌లలో కొన్ని వ్యత్యాసాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడికి నోటీసులు ఇచ్చారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన షమీ, తన క్రికెట్ కెరీర్ కారణంగా చాలాకాలంగా కోల్‌కతాలోనే నివసిస్తున్నాడు.

షమీతో పాటు అతడు సోదరుడు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) లోని వార్డు నంబర్ 93 (రాష్‌బెహారీ అసెంబ్లీ నియోజకవర్గం) లో ఓటర్లుగా నమోదై ఉన్నారు. వాస్తవానికి వారిద్దరూ సోమవారం(జనవరి 5) అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ముందు హాజరుకావాల్సి ఉంది. ​కానీ షమీ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నందున విచారణకు హజరుకాలేకపోయాడు. 

"దేశవాళీ క్రికెట్ టోర్నీలో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, నిర్దేశించిన సమయానికి హాజరు కాలేకపోతున్నాను" అని షమీ ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. దీంతో షమీ  అభ్యర్థన ఎన్నికల కమిషన్ విచారణను వాయిదా వేసింది. బెంగాల్ జట్టు లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, జనవరి 9 నుంచి 11 మధ్య హాజరుకావాలని సూచించింది.
చదవండి: IND vs SA: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)