Breaking News

చరిత్రపుటల్లోకెక్కిన పాక్‌ బౌలర్‌

Published on Thu, 08/21/2025 - 19:35

పాకిస్తాన్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ చరిత్రపుటల్లోకెక్కాడు. పొట్టి ఫార్మాట్‌లో 400 వికెట్లు తీసిన రెండో పాక్‌ బౌలర్‌గా అవతరించాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు.

ప్రస్తుతం కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడుతున్న ఆమిర్‌ (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌).. ఇవాళ (ఆగస్ట్‌ 21) ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని తాకాడు. ఆమిర్‌కు ముందు పాక్‌ తరఫున వాహబ్‌ రియాజ్‌ ఈ ఘనత సాధించాడు. 

రియాజ్‌ 2005 నుంచి 2023 మధ్యలో 348 టీ20లు ఆడి 413 వికెట్లు సాధించగా.. ఆమిర్‌ 2008 నుంచి ఈ ఫార్మాట్‌లో కొనసాగుతూ 343 మ్యాచ్‌ల్లో 400 వికెట్లు తీశాడు.

పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రషీద్‌ ఖాన్‌ (658), డ్వేన్‌ బ్రావో (631), సునీల్‌ నరైన్‌ (590), ఇమ్రాన్‌ తాహిర్‌ (549), షకీబ్‌ అల్‌ హసన్‌ (499), ఆండ్రీ రసెల్‌ (485), క్రిస్‌ జోర్డన్‌ (438), వాహబ్‌ రియాజ్‌ (413) ఆమిర్‌ కంటే ముందున్నారు.

33 ఏళ్ల ఆమిర్‌ 2021లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించి, ఆతర్వాత మనసు మార్చుకున్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు తిరిగి అతడు పాకిస్తాన్‌ జట్టులో చేరాడు. ఆ టోర్నీ అనంతరం మళ్లీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 

అప్పటి నుంచి ఐపీఎల్‌ మినహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేట్‌ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఆమిర్‌ ఇటీవల ఐపీఎల్‌ ఆడాలనే కల ఉందని చెప్పాడు. అవకాశం వస్తే ఆర్సీబీకి ఆడతానని అన్నాడు. ఆమిర్‌ ప్రస్తుతం బ్రిటన్‌ పౌరసత్వం పొంది ఐపీఎల్‌ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కాగా, పాక్‌ ఆటగాళ్లపై ఐపీఎల్‌లో నిషేధం ఉన్న విషయం తెలిసిందే.

ఆమిర్‌ పాక్‌ తరఫున 36 టెస్ట్‌లోల​ 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 62 టీ20ల్లో 71 వికెట్లు తీశాడు. పాక్‌ తరఫున ఆమిర్‌ కెరీర్‌ వివాదాల మయంగా ఉంది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో అతను ఐదేళ్లు (2010-15) నిషేధం ఎదుర్కొన్నాడు. 
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)