Breaking News

సీఎస్‌కేతో మ్యాచ్‌.. కేకేఆర్ స్టార్ ఓపెన‌ర్ పై వేటు! అత‌డి ఎంట్రీ?

Published on Fri, 04/11/2025 - 17:49

ఐపీఎల్‌-2025లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శుక్ర‌వారం చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో కేకేఆర్ త‌ల‌ప‌డ‌నుంది. గ‌త మ్యాచ్‌లో ల‌క్నోపై అనుహ్య ఓట‌మి చ‌విచూసిన కేకేఆర్‌.. ఇప్పుడు సీఎస్‌కేపై గెలిచి తిరిగి పుంజుకోవాల‌ని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా జ‌ట్టు ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగనున్న‌ట్లు తెలుస్తోంది.

వ‌రుస మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మ‌వుతున్న స్టార్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌పై వేటు వేయాల‌ని కేకేఆర్ మేనెజ్‌మెంట్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. అత‌డి స్దానంలో అఫ్గానిస్తాన్ ఓపెన‌ర్ రెహ్మ‌తుల్లా గుర్బాజ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అదేవిధంగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు పేస‌ర్ స్పెన్స‌ర్ జాన్సెన్‌ను కూడా కేకేఆర్ ప‌క్క‌న పెట్ట‌నున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

చెపాక్ పిచ్ ఎక్కువగా స్పిన్‌కు అనుకూలించ‌నున్న నేప‌థ్యంలో స్పిన్ ఆల్‌రౌండ‌ర్ మోయిన్ అలీని తుది జ‌ట్టులోకి తీసుకురావాల‌ని కేకేఆర్ కోచ్ అండ్ కెప్టెన్ భావిస్తున్న‌ట్లు వినికిడి. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో కేకేఆర్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవ‌లం రెండింట మాత్ర‌మే విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో కోల్‌క‌తా 4 పాయింట్ల‌తో ఆరో స్ధానంలో కొన‌సాగుతోంది. మ‌రోవైపు సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని తిరిగి బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. 

రెగ్యూలర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్ నుంచి వైదొల‌గ‌డంతో ధోని మ‌రోసారి చెన్నై జ‌ట్టును న‌డిపించనున్నాడు. సీఎస్‌కేకు కూడా ఈ మ్యాచ్ చాలా కీల‌కం. ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడిన సూప‌ర్ కింగ్స్ కేవ‌లం ఒకే  ఒక మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. రుతురాజ్ స్ధానంలో రాహుల్ త్రిపాఠి తుది జ‌ట్టులో వ‌చ్చే ఛాన్స్ ఉంది.

తుది జ‌ట్లు(అంచ‌నా)
కేకేఆర్‌
రెహ్మ‌తుల్లా గుర్బాజ్‌, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, మొయిన్ అలీ, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

సీఎస్‌కే
రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), ఆర్‌ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్
చ‌ద‌వండి: PSL 2025: వ‌రుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి త‌ప్పుకున్న మ‌రో స్టార్ ప్లేయ‌ర్‌
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)