Breaking News

చరిత్ర సృష్టించిన మిచెల్‌ సాంట్నర్‌

Published on Thu, 11/06/2025 - 09:29

వెస్టిండీస్‌తో నిన్న (నవంబర్‌ 5) జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (Mitchell Santner) చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. వీరోచిత పోరాటాన్ని (28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు) ప్రదర్శించాడు. సాంట్నర్‌ చెలరేగినా న్యూజిలాండ్‌ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తద్వారా స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకపడిపోయింది.

ఈ ఇన్నింగ్స్‌తో సాంట్నర్‌ పలు రికార్డులు నెలకొల్పాడు. ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ టీమ్‌లలో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్లలో హాఫ్‌ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ విభాగంలో అత్యధిక స్కోర్‌ సాంట్నర్‌ సహచరుడు టిమ్‌ సౌథీ (39), ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు (39) రషీద్‌ ఖాన్‌ పేరిట సంయుక్తంగా ఉండేది.

ఈ మ్యాచ్‌లో 107/9 స్కోర్‌ వద్ద జేకబ్‌ డఫీతో (1 నాటౌట్‌) సాంట్నర్‌ పదో వికెట్‌కు అజేయమైన 50 పరుగులు జోడించాడు. తద్వారా ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ టీమ్‌లలో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం జోడించిన రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు జోష్‌ లిటిల్‌-బ్యారీ మెక్‌కార్తీ (44*) పేరిట ఉండేది.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. షాయ్‌ హోప్‌ (53) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ను సాంట్నర్‌ (55 నాటౌట్‌) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, రోస్టన్‌ ఛేజ్‌ తలో 3 వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఆక్లాండ్‌ వేదికగా నవంబర్‌ 6న జరుగనుంది. 

చదవండి: నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ వృథా

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)