Breaking News

నోరు మూసుకున్నందుకు రెడ్‌కార్డ్‌.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి!

Published on Sat, 06/20/2026 - 12:13

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీ వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారుతోంది. తాజాగా శ‌నివారం పరాగ్వే, తుర్కియో మ్యాచ్ సందర్భంగా పర్వాగ్వే మిడ్‌ఫీల్డర్ మిగ్యుల్ అల్మిరాన్ చేతితో నోరును మూసుకున్నాడన్న కారణంతో రిఫరీ రెడ్‌కార్డ్ చూపించడం చర్చనీయాంశంగా మారింది.

ఫిఫాలో ఈసారే ప్రవేశపెట్టిన ఈ కొత్త రూల్ ఇప్పుడు హైలైట్‌గా నిలిచింది. విషయంలోకి వెళితే..  మ్యాచ్‌లో ఫౌల్ అనంతరం తుర్కియో డిఫెండర్ మెర్ట్ ముల్దర్‌తో పరాగ్వే ఫార్వర్డ్ ఆటగాడు ఇసిడ్కో పిట్టా వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగానే ఇరుజట్ల ఆటగాళ్లు గుంపుగా వ‌చ్చేశారు. ఈ స‌మయంలో జ‌ట్టుకు కాస్త దూరంలో ఉన్న అల్మిరాన్ ముల్ద‌ర్‌తో మాట్లాడుతూ నోటికి చేతిని అడ్డుపెట్టాడు.  

అల్మిరాన్ చ‌ర్య ప‌ట్ల‌ తుర్కియే డిఫెండ‌ర్ రిఫ‌రీకి ఫిర్యాదు చేశాడు. వీఏఆర్‌ (Video Assistant Referee)  ద్వారా మ్యాచ్ అధికారులు వీడియోను మ‌రోసారి ప‌రిశీలించారు. రిప్లేలో అల్మిరాన్ త‌న నోరును మూసుకున్న‌ట్లు తేల‌డంతో రిఫ‌రీ బార్డ‌న్ వెంట‌నే అత‌డికి రెడ్ కార్డ్ చూపించాడు. దీంతో ప‌రాగ్వే జ‌ట్టు 10 మందితోనే మిగ‌తా మ్యాచ్ ఆడాల్సి వ‌చ్చింది.

ఫిఫా తెచ్చిన కొత్త రూల్ ఏంటంటే?
2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫిఫా కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మైదానంలోనే దుర్భాష‌కు దిగ‌డం లేదా వివ‌క్షపూరిత వ్యాఖ్య‌లు చేయ‌డం నిషేధం. ఇదే నిబంధ‌న ప్ర‌కారం ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుతో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన స‌మ‌యంలో స‌ద‌రు ఆట‌గాడు చేతితో లేదా భుజంతో లేదా చొక్కాతో నోరు మూసుకుంటే అత‌డికి రెడ్ కార్డ్ చూపించ‌వ‌చ్చు. 

మ్యాచ్ అధికారులకు తెలియ‌కుండా ఆట‌గాళ్లు చేసే వ్యాఖ్య‌లు దాచిపెట్ట‌కుండా నిరోధించ‌డ‌మే ఈ చ‌ట్టం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ నిబంధ‌న కేవ‌లం ఫిఫాకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని, క్ల‌బ్ మ్యాచ్‌లు, స్నేహ‌పూర్వ‌క సంభాష‌ణ స‌మ‌యంలో ఒక ఆట‌గాడు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే రెడ్‌కార్డ్ చూప‌డం జ‌ర‌గ‌ద‌ని ఫిఫా నిర్వాహ‌కులు తెలిపారు.

బోణీ కొట్టిన‌ ప‌రాగ్వే 
అల్మిరాన్ రెడ్‌కార్డ్‌కు గుర‌వ్వ‌డంతో ప‌దిమందితోనే ఆడిన ప‌రాగ్వే 1-0తో తుర్కియేపై విజ‌యం సాధించి ఫిఫాలో బోణీ కొట్టింది. అల్మిరాన్ రెడ్‌కార్డ్‌కు గుర‌వ్వ‌డంతో అత‌డు కొట్టిన గోల్ చెల్ల‌దు. మ‌రో గోల్‌ను మ‌టియ‌స్ గాల్జా (ఆట 2వ నిమిషంలో) జ‌ట్టుకు అందించాడు. ఈ క్ర‌మంలో గాల్జా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫాస్టెస్ట్ గోల్ న‌మోదు చేశాడు. 65 సెకన్ల వ్య‌వ‌ధిలోనే గాల్జా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. ఇవాళ ఉద‌యం మొరాకో ఆట‌గాడు ఇస్మాయిల్ సైబారి 72 సెకన్ల వ్య‌వ‌ధిలో కొట్టిన గోల్ రికార్డు గంట‌ల వ్య‌వ‌ధిలోనే బ‌ద్ద‌లు కావ‌డం గ‌మ‌నార్హం.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)