Breaking News

క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. ముంబై, సన్‌రైజర్స్‌ అరుదైన ఫీట్‌!

Published on Wed, 07/22/2026 - 07:22

ఇంగ్లండ్ వేదిక‌గా ప్రారంభ‌మైన హండ్రెడ్ లీగ్ టోర్నీలో ముంబై ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ ఫ్రాంచైజీలు శుభారంభం చేశాయి. ఏక‌కాలంలో ప్రారంభ‌మైన హండ్రెడ్ మెన్స్‌, హండ్రెడ్ వుమెన్స్ టోర్నీల్లో విజ‌యాలు అందుకున్నాయి. పురుషుల హండ్రెడ్ లీగ్‌లో స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ లండ‌న్ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోగా, అటు మ‌హిళ‌ల విభాగంలో ముంబై ఇండియ‌న్స్ లండ‌న్‌పై స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించడం విశేషం. ఏక‌కాలంలో రెండు జ‌ట్లు ఒక దానిపై ఒకటి వేర్వేరుగా విజ‌యాలు న‌మోదు చేయ‌డం క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి.

దంచికొట్టిన పూర‌న్‌..
పురుషుల హండ్రెడ్ లీగ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ 99 బంతుల్లో 143 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ (27 బంతుల్లో 41), టామ్ అల్సోప్ (18 బంతుల్లో 31) దూకుడుగా ఆడారు. ముంబై బౌల‌ర్ల‌లో రిచ‌ర్డ్ గ్లెస‌న్ 4 వికెట్లు తీయ‌గా, సామ్ క‌ర‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ లండ‌న్ జ‌ట్టు 84 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 144 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. కెప్టెన్ సామ్ క‌ర‌న్ (39 బంతుల్లో 60 నాటౌట్‌), నికోల‌స్ పూర‌న్ (22 బంతుల్లో 58 నాటౌట్‌) విధ్వంసం సృష్టించారు.

రాణించిన దీప్తి శ‌ర్మ‌
మ‌హిళ‌ల హండ్రెడ్ టోర్నీ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ లండ‌న్ జ‌ట్టు 100 బంతుల్లో 8 వికెట్ల న‌ష్టానికి 107 ప‌రుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (33), డానీ వ్యాట్ (29) ప‌ర్వాలేద‌నిపించారు. ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ‌, డానియెల్లి గిబ్స‌న్‌లు చెరో 2 వికెట్లు తీశారు. అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ 69 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 109 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ఫోబె లిచ్‌ఫీల్డ్ (3), అనాబెల్ స‌ద‌ర్లాండ్ (30) విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు.

Videos

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)