అరుదైన ఫీట్‌తో ఫిఫా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన ఎంబాపె

Published on Fri, 07/10/2026 - 12:14

ఫిపా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ఫ్రాన్స్ సంచ‌ల‌నం కైలియ‌న్ ఎంబాపె గోల్స్ వ‌ర్షం కురిపిస్తున్నాడు. 30 ఏళ్లు కూడా నిండ‌ని ఎంబాపె ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌, మూడు అసిస్ట్‌ల‌తో గోల్డెన్ బూట్ రేసులో మెస్సీతో క‌లిసి సంయుక్తంగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఒక‌వేళ అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు మ‌రోసారి ఫైన‌ల్లో త‌ల‌ప‌డితే ఎవ‌రికి గోల్డెన్ బూట్ అందుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. 

ఇప్ప‌టికే క్వార్ట‌ర్ ఫైన‌ల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక 27 ఏళ్ల ఎంబాపెకు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్పుల్లో ఇది 20వ గోల్ కావ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలోనే ఎంబాపె ఒక అరుదైన ఫీట్ సాధించి ఫిఫా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశాడు. 30 ఏళ్ల లోపే ఫిఫాలో 20 గోల్స్ కొట్టిన తొలి ఆట‌గాడిగా కైలియ‌న్ ఎంబాపె రికార్డు సృష్టించాడు.

ఇక ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్పుల్లో అత్య‌ధిక గోల్స్ కొట్టిన జాబితాలో ఎంబాపె రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. తొలి స్థానంలో అర్జెంటీనా సూప‌ర్‌స్టార్ లియోనల్ మెస్సీ (21 గోల్స్‌) ఉన్నాడు. మెస్సీ రికార్డును అధిగ‌మించేందుకు ఎంబాపె రెండు గోల్స్ దూరంలో నిలిచాడు. ఇక మొరాకోతో మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0తో విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. 

తొలి అర్ధ‌భాగంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మైన ఎంబాపె రెండో అర్ధ‌భాగంలో మాత్రం 60వ నిమిషంలో గోల్‌తో మెరిశాడు. ఈ ఫిఫాలో ఎంబాపెకు ఇది 8వ గోల్ కావ‌డం విశేషం. ఆ త‌ర్వాత 66వ నిమిషంలో డెంబ్లీకి పాస్ అందించి అత‌డు రెండో గోల్ కొట్ట‌డంలో స‌హాయ‌ప‌డ్డాడు. 2018లో విజేత‌గా నిలిచిన ఫ్రాన్స్ జ‌ట్టు 2022లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఇక వ‌రుస‌గా మూడోసారి సెమీస్ చేరిన ఫ్రాన్స్ టైటిల్ అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో ఉంది.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)