Breaking News

అతడి భార్య పోటీకి వస్తుందేమో!.. నేనే నంబర్‌ వన్‌!

Published on Fri, 06/27/2025 - 17:51

టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)పై భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. అద్భుత నైపుణ్యాలు జెస్సీ సొంతమని.. బ్యాటింగ్‌ లెజెండ్స్‌ సచిన్‌ టెండుల్కర్‌, విరాట్‌ కోహ్లి (Virat Kohli)లతో సరిసమాన గౌరవానికి అతడు అర్హుడని పేర్కొన్నాడు. బుమ్రా తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడన్న అశూ.. అందరికంటే తానే వీరాభిమానినని తెలిపాడు.

ఇంగ్లండ్‌ పర్యటనలో
కాగా ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బుమ్రా.. ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడు సత్తా చాటాడు.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్ల బౌలింగ్‌లో 83 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఈ కుడిచేతివాటం పేసర్‌ స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది.

సమాన గౌరవం దక్కాలి
ఇదిలా ఉంటే.. గిల్‌ సేన మ్యాచ్‌ ఓడినా.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ప్రదర్శన పట్ల మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తాను బుమ్రాకు వీరాభిమానినంటూ అశూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘టెండుల్కర్‌, కోహ్లి మాదిరే బుమ్రాకు సమాన గౌరవం దక్కాలి. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, సచిన్‌ టెండుల్కర్‌ల విషయంలో మనమేం చేశామో.. జెస్సీ విషయంలోనూ అదే చేయాలి. నిజానికి బౌలర్‌గా అతడికి అందరికంటే ఎక్కువ గౌరవమే దక్కాలి.

అతడి భార్య పోటీకి వస్తుందేమో!.. నేనే నంబర్‌ వన్‌
అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎంతో మంది అతడిని ప్రేమిస్తున్నారు. నేనైతే అతడి నంబర్‌ వన్‌ ఫ్యాన్‌ని. నాకు తెలిసి ఈ నంబర్‌ వన్‌ ఫ్యాన్‌ విషయంలో బుమ్రా భార్య నాతో పోటీకి వస్తుందేమో! కానీ నేను మాత్రం నేనే నంబర్‌ వన్‌ అని చెప్తా’’ అంటూ అశ్విన్‌ బుమ్రా పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు.

కాగా బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ అన్న విషయం తెలిసిందే. ఐసీసీ ఈవెంట్లతో పాటు ఐపీఎల్‌లోనూ వ్యాఖ్యాతగా సత్తా చాటుతోందామె. ఈ జంటకు కుమారుడు అంగద్‌ బుమ్రా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉన్న టీమిండియా.. జూలై 2-6 వరకు రెండో టెస్టు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. పనిభారం తగ్గించే నిమిత్తం యాజమాన్యం అతడికి రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చినట్లు సమాచారం.

చదవండి: సచిన్‌ సర్‌ కొడుకు.. అర్జున్‌పై ఎలా అరవగలను?.. కెప్టెన్‌గా ఉన్నపుడు జరిగిందిదే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)