Breaking News

టీమిండియా యువ సంచలనానికి బంపరాఫర్‌

Published on Wed, 06/10/2026 - 15:22

తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో అద్భుత ప్రదర్శనతో (7 వికెట్లు) ఆకట్టుకున్న టీమిండియా యువ సంచలనం మానవ్‌ సుతార్‌కు ఊహించని అవకాశం లభించింది. అరంగేట్రంలోనే మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన ఇచ్చిన అతడితో ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లోని ప్రముఖ జట్టైన వార్విక్‌షైర్‌ రెండు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ల ఒప్పందం చేసుకుంది.

సుతార్‌కు ఈ డీల్‌ చాలా లక్కీగా పరిగణించబడుతోంది. టీమిండియా భవిష్యత్‌ ఇంగ్లండ్‌ పర్యటనల్లో అతడికి ఈ అనుభవం​ చాలా పనికొస్తుంది. స్పిన్నర్లకు పెద్దగా సహకరించని ఇంగ్లండ్‌ పిచ్‌లపై సుతార్‌ తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లండ్‌లో రాణిస్తే సుతార్‌ భవిష్యత్తుకు తిరుగుండదు.

అశ్విన్‌ రిటైర్మెంట్‌, జడేజా తరచుగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు విదేశీ పరిస్థితుల్లో స్థిరమైన స్పిన్నర్ అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో సుతార్ ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో అనుభవం సాధించడం టీమిండియాకు చాలా ఉపయోగపడుతుంది.

దేశీయ క్రికెట్‌లో అత్యుత్తమ ట్రాక్‌ రికార్డు (30 మ్యాచ్‌ల్లో 136 వికెట్లు) కలిగిన సుతార్‌.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌తో టీమిండియా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్పెల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపుకు తిప్పింది. 

రెండో ఇన్నింగ్స్‌లోనూ సుతార్‌ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ మరో వికెట్ సాధించాడు. మొత్తంగా అరంగేట్ర టెస్ట్‌లో 7 వికెట్లు తీసి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకుగానూ అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు