Breaking News

శ్రీలంక జట్టులో భారీ మార్పులు

Published on Thu, 04/24/2025 - 03:06

కొలంబో: స్వదేశంలో జరగనున్న మహిళల ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌ కోసం శ్రీలంక జట్టు భారీ మార్పులు చేసింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం శ్రీలంక జట్టు 8 మార్పులు చేసి బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో పాటు భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో న్యూజిలాండ్‌ చేతిలో శ్రీలంక మహిళల క్రికెట్‌ జట్టు 0–2తో సిరీస్‌ కోల్పోవడంతో జట్టును ప్రక్షాళన చేసింది. 

సీనియర్‌ బ్యాటర్‌ చమరి ఆటపట్టు లంక జట్టుకు సారథ్యం వహిస్తుండగా... న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో ఆకట్టుకున్న మీడియం పేసర్‌ మల్కీ మదారాకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నమెంట్‌లో ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి సార్లు తలపడనుంది. మ్యాచ్‌లన్నీ ప్రేమదాస స్టేడియంలోనే జరగనున్నాయి. వచ్చే నెల 11న ఫైనల్‌ జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత అమ్మాయిల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. 

శ్రీలంక జట్టు: చమరి ఆటపట్టు (కెప్టెన్  ), హర్షిత సమరవిక్రమ, విష్మీ గుణరత్నె, నీలాక్షిక సిల్వ, కవిషా దిల్హారి, అనుష్క సంజీవని, మనుడి ననయక్కర, హాసిని పెరెరా, ఆచిని కులసూర్య, పియూమి బడాల్గే, దేవ్‌మి విహంగ, హన్సిమ కరుణరత్నె, మల్కీ మదారా, ఇనోషి ప్రియదర్శిని, సుగంధిక కుమారి, రష్మిక, ఇనోక రణవీర. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)