Breaking News

RCB: హైదరాబాద్‌లో తప్పిన ముప్పు

Published on Thu, 06/05/2025 - 09:49

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ 2025 టైటిల్‌ గెలిచిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సన్మానం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొందరు చనిపోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్‌ (Hyderabad) నగరంలోనూ ఇలాంటి ముప్పు తప్పింది. 

బుధవారం రాత్రి ఆర్సీబీ (RCB) జట్టు ఐపీఎల్‌ కప్పు గెలిచిన వెంటనే ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి చౌరస్తా, అంబేడ్కర్‌ విగ్రహం చౌరస్తా, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్‌లతో పాటు అనేక ప్రాంతాలు క్రికెట్‌ అభిమానులతో నిండిపోయాయి. ద్విచక్ర వాహనాలపై ఫీట్లు చేస్తూ యువకులు కేరింతలు కొట్టారు. రహదారులపై పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు.

ఎన్డీఆర్‌ మార్గ్, సచివాలయం, తెలుగుతల్లి చౌరస్తా ప్రాంతాల్లో కొందరు రెచ్చిపోయారు. అక్కడ ఆగిన వాహనాల పైకి ఎక్కి హంగామా చేశారు. ద్విచక్ర వాహనాల హారన్లు మోగిస్తూ, మితిమీరిన వేగంతో నడిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఆ ప్రాంతాలకు పంపారు. వీళ్లు అక్కడ ఉన్న యువకుల్ని చెదరగొట్టి పరిస్థితుల్ని చక్కదిద్దారు.  

చ‌ద‌వండి: ఒక్క‌గానొక్క కొడుక‌య్యా.. మీకు ద‌ణ్ణం పెడ‌తా

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)